Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వర్షాకాలంలో తడి అండర్‌వేర్‌లు వేసుకుంటున్నారా? బీ కేర్‌ఫుల్!
వర్షాలు విడవకుండా రోజూ దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గత నాలుగైదు రోజుల నుంచి సూర్యుడి కనబడట్లేదు. ఇలాంటి తేమ వాతావరణం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి. వర్షాలు పడితేనే వైరల్ ఇన్ఫెక్షన్లు బాధిస్తాయి. పైగా ఇలాంటి వాతావరణం వల్ల అవి మరింత ఎక్కువ అవుతాయి. ఈ సమయంలో ఉతికిన బట్టలు ఆరడం కూడా కష్టమే. చాలా మందికి ఒంటిపై ఒక అండర్‌వేర్ ఉంటే దండెంపై మరొకటి ఉంటుంది. ఇలాంటి వారికి వర్షాకాలం చాలానే సమస్యలు తీసుకువస్తుంది.

వర్షాకాలంలో తడిగా ఉన్న అండర్‌వేర్లు చాలా మంది వేసుకుంటుంటారు. కొంత మంది అయితే శరీర వేడికి అండర్‌వేర్ లు ఆరిపోతాయని కూడా అంటుంటారు. అయితే ఇలా తడి అండర్‌వేర్‌లు వేసుకోవడం వల్ల పలు సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తడి అండర్‌వేర్‌లు వేసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. ఇన్ఫెక్షన్ల వచ్చే అవకాశాలు పెరుగుతాయి
తడి అండర్‌వేర్‌లు ధరించడం వల్ల బ్యాక్టీరియా, శిలీంధాల వృద్ధికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. వెచ్చని, తేమతో కూడిన ప్రాంతాల్లో సూక్ష్యక్రిములు వృద్ధి చెందుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఈస్ఠ్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వంటి చర్మ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
2. స్కిన్ ఇరిటేషన్, చాఫింగ్
గజ్జల ప్రాంతంలోని సున్నితమైన చర్మానికి వ్యతిరేకంగా తడి అండర్‌వేర్‌ల వల్ల ఘర్షణ, చికాకు పెరుగుతుంద. దీని వల్ల చర్మం ఎర్రబడటం, పుండ్లు రావడం, బొబ్బలు వస్తాయి. దీని వల్ల గజ్జల ప్రాంతంలో బాధగా ఉంటుంది.
3. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI)
తడిగా ఉన్న అండర్‌వేర్‌లు వేసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. దీని వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు - UTIలు వచ్చి బాధిస్తాయి.
4. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది
పదే పదే శరీరాన్ని తేమ, చల్లని పరిస్థితులకు గురి చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన బలహీనపడుతుంది. వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తిని కోల్పోతుంది. దీని వల్ల జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
5. సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం
పురుషులకు, వర్షాకాలంలో తడి అండర్‌వేర్ లు పదే పదే వేసుకోవడం వల్ల స్క్రోటల్ ఉష్ణోగ్రత పెరగడానికి దారి తీస్తుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. సంతానోత్పత్తిపైనా ప్రభావం పడుతుంది. దీని వల్ల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడటానికి జననేంద్రియ ప్రాంతం చుట్టూ చల్లని, పొడి వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరం.
వర్షాకాలంలో తడి అండర్‌వేర్ పదే పదే ధరించడం వల్ల రోగాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇన్ఫెక్షన్లు సోకుతాయి. తడి అండర్‌వేర్ ల వల్ల గజ్జల ప్రాంతంలో పుండ్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే పొడి అండర్‌వేర్‌లు మాత్రమే వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











