Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
రంజాన్ ఉపవాసం..మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
రంజాన్ పవిత్ర మాసం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక చింతనతో నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం(ఇఫ్తార్) వరకు అన్నపానీయాలు పూర్తిగా మానివేసి దేవుని ధ్యానంలో గడుపుతారు.
రంజాన్ ఉపవాసం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మికమైనదే అయినప్పటికీ.. ఈ 30 రోజుల పాటు పగటిపూట ఏమీ తినకుండా, తాగకుండా ఉన్నప్పుడు అసలు మన శరీరంలో ఎలాంటి భౌతిక మార్పులు జరుగుతాయో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రంజాన్ ఉపవాసం అంటే కేవలం కడుపు మాడ్చుకోవడం కాదు మన శరీరాన్ని ఒక సరికొత్త, ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు చేయడం. ఈ ఉపవాసాల వల్ల శరీరంలో జరిగే ఆసక్తికరమైన మార్పులు ఉంటాయి.
సరికొత్త లయకు అలవాటు పడే జీవక్రియ
ఉపవాసం ఉన్న సమయంలో శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పడిపోయి, లివర్ లో నిల్వ ఉన్న గ్లైకోజెన్ ను శరీరం శక్తి కోసం వాడుకుంటుంది. రోజులు గడిచేకొద్దీ మన శరీరం కొవ్వును కరిగించి శక్తిగా మార్చుకోవడం నేర్చుకుంటుంది. ఈ ప్రక్రియ వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ను అద్భుతంగా అదుపులోకి వస్తాయి.
బరువు తగ్గుతారా?
ఉపవాసం ఉంటే కచ్చితంగా బరువు తగ్గుతామని చాలామంది భావిస్తారు. అయితే ఇది మీరు తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఇఫ్తార్ సమయంలో పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే నెలలో ఒకటి నుంచి మూడు కిలోల వరకు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు.
అలాకాకుండా నూనెలో వేయించిన పదార్థాలు, స్వీట్లు, చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకుంటే మాత్రం బరువులో పెద్దగా మార్పు ఉండదు. ఇక్కడ అతిగా తినడం కంటే మితంగా తినడమే అసలైన మంత్రం.
గుండెకు రక్ష.. వాపులకు చెక్
రంజాన్ ఉపవాసం గుండెకు ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమశిక్షణతో కూడిన ఉపవాసం వల్ల చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. ఇఫ్తార్ భోజనంలో ఫైబర్, ప్రొటీన్లు ఉండేలా చూసుకుంటే శరీరంలో వాపులు తగ్గి, గుండె మరింత ఆరోగ్యంగా మారుతుంది.

మాయమయ్యే ఆకలి బాధలు
ఉపవాసం మొదలుపెట్టిన మొదటి రెండు, మూడు రోజులు కాస్త కష్టంగా అనిపించడం సహజం. తలనొప్పి, నీరసం, విపరీతమైన ఆకలిగా అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా మన శరీరం ఈ కొత్త దినచర్యకు చాలా వేగంగా సర్దుకుంటుంది. వారం గడిచేసరికి ఆకలిని నియంత్రించే గ్రెలిన్ అనే హార్మోన్ కొత్త సమయాలకు అనుగుణంగా మారిపోతుంది. అందుకే రంజాన్ మధ్యలోకి వచ్చేసరికి ఉపవాసకులు నీరసం వదిలేసి, మరింత శక్తివంతంగా కనిపిస్తారు.
ఎవరు జాగ్రత్త పడాలి?
ఉపవాసం ఎన్నో ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ.. మధుమేహం, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలు, క్రమం తప్పకుండా మందులు వాడేవారు డాక్టర్ల సలహా లేకుండా ఉపవాసం ఉండకూడదు. మందుల సమయాలు మార్చుకోవడం, రాత్రి వేళల్లో తగినన్ని నీళ్లు తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఆధ్యాత్మికతతో పాటు దేహానికి రీసెట్
రంజాన్ అనేది అంతిమంగా ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించిన పండగ. కానీ ఈ 30 రోజుల్లో అలవడే ఆహారపు క్రమశిక్షణ, నిగ్రహం మన శరీరానికి ఒక అద్భుతమైన రీసెట్ బటన్ లా పనిచేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications