Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
ధనికులైనా, పేదలైనా ప్రతి భారతీయుడి వంటగదిలో అల్లం తప్పక ఉంటుంది. అల్లం లేని భారతీయ వంటగదిని ఊహించలేము. అల్లం మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ధర తక్కువ ప్రయోజనాలు ఎక్కువగా ఉండే అల్లంని మనం అనేక రకాలుగా వాడుతుంటాం. టీ తయారీకి, అలాగే కూరల్లో రుచి, వాసన పెంచేందుకు ఇలా అల్లంని వాడుతుంటాం.

అయితే అల్లం కేవలం వంటలకు రుచిని, సువాసనను మాత్రమే ఇస్తుందనుకుంటే పొరపాటే. శతాబ్దాలుగా మన సాంప్రదాయ, ఆయుర్వేద వైద్యంలో అల్లాన్ని ఒక శక్తివంతమైన ఔషధంగా పూజిస్తున్నారు. అల్లంలో జింజరోల్,షోగావోల్ ,జింజిబెరీన్ అనే అత్యంత పవర్ ఫుల్ నేచురల్ మూలకాలు దాగి ఉన్నాయి. ఇవే అల్లానికి ఆ ఘాటైన రుచిని, అనంతమైన ఔషధ గుణాలను అందిస్తాయి. కొన్ని నెలల పాటు రోజూ పరిమిత మోతాదులో అల్లాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే అద్భుతాలు ఏంటో ఇక్కడ చూడండి.
పొట్టకు శ్రీరామరక్ష
ప్రయాణాలు చేసేటప్పుడు వచ్చే వికారం, వాంతులు లేదా కడుపులో అసౌకర్యంగా ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్క చప్పరిస్తే చాలు.. ఆ సమస్య ఇట్టే మాయమవుతుంది. ప్రతిరోజూ కొద్దిగా అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అజీర్తి సమస్యలు దూరమై, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
నొప్పుల నివారణ
వయసుతో పాటు వచ్చే కీళ్ల నొప్పులు, శరీరంలో వాపులు మనల్ని ఎంతగానో బాధిస్తాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ముఖ్యంగా అందులోని షోగాల్ అనే సమ్మేళనం, శరీర నొప్పులను తగ్గించడంలో పెయిన్ కిల్లర్స్ లా పనిచేస్తాయి. మోకాళ్ల నొప్పులకు ఇది ఒక సహజసిద్ధమైన ఉపశమనం.
గుండెకు, మెదడుకు నేస్తం
కేవలం చిన్న చిన్న నొప్పులకే కాదు, గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇది వయసు పైబడే కొద్దీ వచ్చే మతిమరుపును అడ్డుకుని మెదడును చురుకుగా ఉంచడంలో సాయపడుతుంది.
మధుమేహానికి చెక్
రోజువారీ జీవితంలో అల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి ఉక్కులా మారుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది తప్పక తెలుసుకోండి
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అల్లాన్ని గుప్పెళ్లు కొద్దీ తినేయకూడదు. అల్లం అనేది మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక అద్భుతమైన నివారణ మార్గం మాత్రమే. ఇది ఏ తీవ్రమైన అనారోగ్యానికీ, డాక్టర్లు ఇచ్చే మందులకూ ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా వ్యాధులతో బాధపడేవారు అల్లాన్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకునే ముందు కచ్చితంగా తమ డాక్టర్ సలహా తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications