Latest Updates
-
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే!
చిన్న లవంగం..చేసే మేలు అనంతం! ఈ నీటి రహస్యం తెలిస్తే వదలరు
పేదలైనా, ధనవంతులైనా అందరి ఇళ్లల్లోని వంటగదిలో తప్పక ఉండే పదార్థం లవంగం. సాధారణంగా ఆహార పదార్ధాల రుచి పెంచడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే చిన్న సైజులో ఉండే లవంగం వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదండోయ్..మన ఆరోగ్యానికి సంజీవని అని మీకు తెలుసా? వారం రోజుల పాటు ప్రతిరోజూ పొద్దున్నే లవంగాలను నానబెట్టిన నీళ్లు తాగితే మీ శరీరంలో మీరు ఊహించని ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం గ్యారెంటీ.
జీర్ణవ్యవస్థ శుభ్రం..పరాన్నజీవులకు చెక్
మనకు తెలియకుండానే మన జీర్ణవ్యవస్థలో ఎన్నో హానికరమైన పరాన్నజీవులు నివాసం ఏర్పరుచుకుంటాయి. ఇవి మన పోషణను దొంగిలిస్తూ, మనల్ని అనారోగ్యం పాలు చేస్తాయి. లవంగాల నీరు దీనికి ఒక సహజమైన సమాధానం. ఇందులో ఉండే యూజెనాల్ అనే శక్తివంతమైన సమ్మేళనం.. పేగులలో దాగి ఉన్న పరాన్నజీవులను, వాటి గుడ్లను, లార్వాలను సమర్థవంతంగా నాశనం చేస్తుంది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ నీరు మీ శరీరం నుండి వాటిని సహజంగా బయటకు పంపుతుంది. దీంతో మీ జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.

ఉబ్బరం, గ్యాస్ కు శాశ్వత వీడ్కోలు
అన్నం తిన్న తర్వాత కడుపు బెలూన్ లా ఉబ్బిపోయి అసౌకర్యంగా అనిపిస్తుందా? గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అలా అయితే రోజూ ఉదయాన్నే లవంగాల నీటిని తాగడం వల్ల ఇది జీర్ణవ్యవస్థను శాంతపరచి, ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడటాన్ని నివారిస్తుంది, ఉబ్బరం సమస్యను సమూలంగా తగ్గిస్తుంది. రోజంతా కడుపు తేలికగా ఉండి, అసౌకర్యానికి దూరంగా ఉండవచ్చు.
నొప్పులకు సహజ నివారిణి
కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడేవారికి లవంగాల నీరు ఒక గొప్ప ఔషధం. లవంగాలలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ (శరీరంలో వాపును తగ్గించే) గుణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగ నీటిని తాగడం వల్ల శరీరంలోని వాపు తగ్గి, నొప్పుల నుండి సహజమైన ఉపశమనం లభిస్తుంది. ఇది నొప్పి నివారణ మందుల వలె పనిచేస్తూ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నొప్పిని అదుపులో ఉంచుతుంది.
ఆరోగ్యంగా చిగుళ్లు
లవంగాల నీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది కేవలం శ్వాసను తాజాగా మార్చడమే కాకుండా, చిగుళ్లను దృఢంగా,ఆరోగ్యంగా ఉంచుతుంది. దంతక్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడటంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. వారం రోజుల పాటు రోజూ ఉదయం ఈ నీటితో పుక్కిలించడం లేదా తాగడం వల్ల మీ దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది.
లవంగాల నీటిని ఎలా తయారు చేసుకోవాలి?
రెండు పద్ధతులలో దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.
నానబెట్టి తాగడం: ఒక గ్లాసు నీటిలో 4-5 లవంగాలను వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగండి.
మరిగించి తాగడం: ఒక గ్లాసు నీటిలో 4-5 లవంగాలు వేసి 5 నిమిషాల పాటు మరిగించండి. గోరువెచ్చగా అయ్యాక వడకట్టి తాగండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications