Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
HMPV వైరస్ లక్షణాలివే..ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కరోనా పీడ పూర్తిగా విరగడైపోయిందనుకునే సమయంలో చైనా నుంచి వచ్చిన మరో వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతుంది. అదే HMPV(Human Metapneumovirus) వైరస్. చైనాలో ప్రస్తుతం ఈ వైరస్ దెబ్బకి హెల్త్ ఎమర్జెన్సీ కూడా పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, అయితే చైనా ప్రభుత్వం మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. చైనాలో ఈ వైరస్ కారణంగా హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయని, మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ సహా ఈ దేశాల్లో వైరస్
ఈ వైరస్ క్రమంగా మిగతా దేశాలకు కూడా పాకింది. జపాన్, మలేషియా , హాంకాంగ్ దేశాలతో పాటు భారత్ లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించింది. మనదేశంలో తొలి HMPV కేసు ఇవాళ బెంగళూరులో బయటపడగా, ఆ తర్వాత వరుసగా మరో 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరులో రెండు, గుజరాత్ లో 1 HMPV వైరస్ కేసులు ఇవాళ వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వైరస్ పేరు విని ప్రస్తుతం మనదేశంలో చాలామంది ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే దీని గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పనిలేదని మనదేశంలోని ప్రముఖ డాక్టర్లు చెబుతున్నారు. అసలు ఏంటీ HMPV వైరస్? ఎవరికి ఇది ఎక్కువ రిస్క్ అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

HMPV అంటే ఏమిటి?
హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఓ నివేదిక ప్రకారం ఈ వైరస్ 2001లోనే కనుగొనబడింది. ఈ వైరస్ వృద్ధులు, పిల్లలు,బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవాళ్లను వేగంగా ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
HMPV లక్షణాలు
ఈ వైరస్ లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి,దద్దుర్లు,గురక, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అలసట,బలహీనత ఉంటుంది. శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది.
HMPV వైరస్ తీవ్రమైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశముంది. HMPV లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్ కి వెళ్లాలని సూచిస్తున్నారు.
HMPV వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
- ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి
- చేతులు కడుక్కోకుండా ముఖం, కళ్లు, ముక్కును తాకవద్దు.
- అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు దూరం పాటించండి.
- మాస్క్ వాడకం తప్పనిసరి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications