Latest Updates
-
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం!
Sperm Donation: వీర్యదానం అంటే ఏంటి? ఎవరైనా వీర్యదానం చేయవచ్చా?
రక్తదానం చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు.. అలాగే వీర్యదానం చేస్తే ప్రాణాలు పుట్టించవచ్చు. ఈ కాన్సెప్ట్ మీద హిందీలో విక్కీ డోనర్, తెలుగులో నరుడా డోనరుడా అనే సినిమాలు వచ్చాయి. డోనర్ దానం చేసే వీర్యాన్ని మహిళ నుండి విడుదలైన అండంతో ఫలదీకరణ చెందించి ఆ తర్వాత దానిని గర్భంలో ప్రవేశపెడతారు. అప్పుడు అది సాధారణ గర్భంలా వృద్ధి చెందుతుంది.
అసలు వీర్యదానం అంటే ఏంటి.. ఎవరు వీర్యదానం చేయవచ్చు.. వీర్యదానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

వీర్యదానం అంటే ఏంటి?
సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న జంటలకు సహాయం చేయడానికి స్పెర్మ్ కణాలను కలిగి ఉన్న వీర్యాన్ని దానం చేసే ప్రక్రియ వీర్యదానం. విరాళనంగా ఇచ్చిన స్పెర్మ్‌ను గర్భాశయ గర్భధారణ(IUI), ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(IVF) లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ICSI) వంటి వివిద పునరుత్పత్తి పద్ధతుల్లో ఉపయోగిస్తారు.
వీర్యదానం అనేది దానిని ఇచ్చే జంటకు తెలియకుండా ఇవ్వొచ్చు, తెలిసీ ఇవ్వొచ్చు. అంటే బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు వీర్యదానం చేయవచ్చు. అలాగే ఎవరు వీర్యదానం చేస్తున్నారో, ఎవరికి వీర్యదానం చేస్తున్నామో తెలియకుండా కూడా స్పెర్మ్ డొనేషన్ చేస్తుంటారు.
వీర్యదానం చేసే ముందు ఎలాంటి పరీక్షలు చేస్తారు, వీర్యదానం చేయడానికి ఎవరు అర్హులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్క్రీనింగ్ - స్పెర్మ్ దానం చేసే ముందు
ఫిజికల్ అసెస్‌మెంట్:
వీర్యాన్ని దానం చేసేంత ఆరోగ్యంగా ఉన్నారో లేదో నిర్ధారించడానికి వైద్యులు పలు పరీక్షలు సూచిస్తున్నారు. రక్త పరీక్షలు, రక్తంలో గ్లూకోజు పరీక్షలు, మూత్ర పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు మొదలైనవి అవసరమవుతాయి. ఈ పరీక్షల ద్వారా HIV, AIDS, STD, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి ఉన్నాయో లేదో తెలుస్తుంది.
ఈ వైద్య పరీక్షలు అన్నింటిలో ఉత్తీర్ణులైతే, అప్రూవ్డ్ స్పెర్మ్ డోనర్ కావొచ్చు. అయితే ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్పెర్మ్ ను దానం చేయాలనుకుంటే ఈ పరీక్షలను మళ్లీ చేయాల్సి ఉంటుంది.
వయో పరిమితి:
స్పెర్మ్ బ్యాంకులు స్పెర్మ్ దానం చేయడానికి నిర్దేశించిన వయస్సు అవసరాలను తీర్చడానికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాగే 45 సంవత్సరాలకు మించి వయస్సు ఉండకూడదు.
కుటుంబ వైద్య చరిత్ర:
మీ కుటుంబం యొక్క వివరణాత్మక వైద్య చరిత్రను అందించాల్సి ఉంటుంది. ఏదైనా వంశపారంపర్య, దీర్ఘకాలిక లేదా జన్యుపరమైన రుగ్మత ఉన్నట్లయితే, స్పెర్మ్ దానం చేయడానికి అనర్హులు అవుతారు.
జన్యు విశ్లేషణ:
మీరు గ్రహీత యొక్క బిడ్డకు అసురక్షితమైన ఏవైనా పుట్టుకతో వచ్చే రుగ్మతలు, వ్యాధులు కలిగి ఉన్నారో లేదో గుర్తించడానికి రక్త నమూనా మూల్యాంకనం చేస్తారు. ఇందులో అంతా ఓకే అనుకున్నాకే వీర్యదాతగా మారవచ్చు.
వీర్యం పరీక్ష:
వీర్య నమూనాలను అందించాలి. వీర్యంలోని స్పెర్మ్ స్టాండర్డ్ కంపోజిషన్, క్వాలిటీ, క్వాంటిటీ కలిగి ఉంటే.. అలాగే 40 శాతం కంటే ఎక్కువ స్పెర్మ్ కదులుతున్నట్లయితే స్పెర్మ్ దానం చేయవచ్చు.
మానసిక అంచనా:
స్పెర్మ్ ను దానం చేయడానికి మానసికంగా దృఢంగా ఉన్నారని, దాంతో ఎలాంటి మానసిక సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి వైద్యులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అలాగే గ్రహీతకు మీ వివరాలు తెలియాలనుకుంటున్నారో లేదో కూడా తెలుసుకుంటారు.
2. స్పెర్మ్ దానం సమయంలో:
స్క్రీనింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పెర్మ్ ను ఎలా దానం చేయాలో వైద్యులు చెబుతారు. స్మెర్మ్ దానం చేయడానికి ముందు కనీసం 2-4 రోజుల శృంగారానికి, హస్తప్రయోగానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
స్పెర్మ్ దానం చేయడానికి, రిజిస్టర్డ్ స్పెర్మ్ బ్యాంక్ లేదా ఫెర్టిలిటీ క్లినిక్‌కు వెళ్లాలి. అక్కడ వారు ఒక కంటైనర్ ఇస్తారు. ఒక గదిలోకి వెళ్లి, వారిచ్చిన కంటైనర్ లో స్ఖలనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానిని వారికి అందించాలి.
స్మెర్మ్ బ్యాంకులోని ప్రైవేటు గదిలో స్పెర్మ్‌ను దానం చేయడం అసౌకర్యంగా అనిపిస్తే.. ఇంట్లోనే వీర్యాన్ని సేకరించి దానిని గంటలోపు స్మెర్మ్ బ్యాంకులో అందించాలి.
3. స్పెర్మ్ డొనేషన్ తర్వాత:
దానం చేసిన వీర్యాన్ని ఆరు నెలల పాటు క్రయోప్రిజర్వ్‌డ్ చేస్తారు. ఆ తర్వాత మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీకు ఎలాంటి వ్యాధులతో బాధపడటం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ వీర్యాన్ని వాడతారు. అప్పుడు అధికారిక స్పెర్మ్ డోనర్ కావొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications