Latest Updates
-
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే..
Superwoman Syndrome: పనులు అనుకున్నట్లుగా జరగకపోతే హైరానా పడుతున్నారా? అయితే మీకు ఈ వ్యాధి ఉందేమో!
ఓ మహిళ భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా, గృహిణిగా.. ఉంటూనే చాలా బరువు, బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంట్లో అందరికీ కావాల్సిన పనులు చేసి పెడుతూనే.. ఉద్యోగం, తన పనులు కూడా చేస్కోవాలి. అయితే ఓ స్త్రీ ఇలాంటి పనుల నుంచి ఎప్పటికీ తప్పించుకోలేదు. అన్ని బాధ్యతలను ఆమె వహించాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో ఆమెకు సాయంగా కొందరు నిలబడ్డా.. చాలా మంది జీవితాల్లో ఒంటరిగానే మహిళలు తమ పనులు చేసుకుంటారు.
ఒకటీ రెండూ కాదు ఎన్నో పనులు స్త్రీలు చేస్తుంటారు. అయితే ఈ అన్ని పనుల్లో కూడా పరిపూర్ణంగా జరిగిపోవాలి, ఎలాంటి పొరపాట్లు జరగకూడదని చేసే ప్రయత్నాన్ని, అలా జరగకపోతే పడే ఆందోళనను సూపర్ ఉమెన్ సిండ్రోమ్ అంటారు. దీని వల్ల మహిళళలు అధిక ఒత్తిడికి గురవడమే కాకుండా.. వ్యక్తిగత అవసరాలను చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్ల నిద్రలేమి, నిరాశ, ఆందోళన, అలసట, తలనొప్పి.. ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

సూపర్ ఉమెన్ సిండ్రోమ్ లక్షణాలు..!
* సూపర్ ఉమెన్ సిండ్రోమ్ వచ్చిన మహిళల్లో దీర్ఘకాలిక అలసట కనిపిస్తుంది.
* నిద్రలేమి మరియు ఇతర నిద్ర ఆటంకాలతో ఇబ్బంది పడుతుంటారు.
* తరచుగా తలనొప్పి లేదా మైగ్రేన్ వంటి సమస్యల బారిన పడతారు.
* వీరిలో ఆందోళన మరియు నిరాశ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది.
* అలాగే ఏకాగ్రత, నిర్ణయం తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది.
* విశ్రాంతి కూడా సరిగ్గా తీసుకోలేరు. విశ్రాంతి సమయాన్ని అసలు ఆస్వాదించలేరు.
* తమకు సంబంధించిన సంరక్షణతో సహా వ్యక్తిగత అవసరాలను కూడా చాలా నిర్లక్ష్యం చేస్తారు.
ఎక్కువగా పని చేసే సూపర్ ఉమెన్ సిండ్రోమ్ కల్గిన మహిళలు.. జీవితంలోని ప్రతి విషయంలో పరిపూర్ణత కోసం ప్రయత్నించకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తమ అవసరాలకు తగ్గట్లుగా పనులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.
సూపర్ ఉమెన్ సిండ్రోమ్ నుంచి ఎలా బయటపడాలంటే..?
ప్రాధాన్యతల గుర్తించాలి:
జీవితంలో అత్యంత ముఖ్యమైన పనులను గుర్తించాలి. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవితంలోని ప్రతి అంశంలో పరిపూర్ణతను సాధించలేరని గ్రహించడం చాలా అవసరం. అలాగే కొన్ని బాధ్యతలను వదులుకోవడం మరింత మంచిది.
వాస్తవిక అంచనాలను సెట్ చేయండి:
ప్రతి దానిలో పరిపూర్ణంగా ఉండటం అసాధ్యం అని అర్థం చేసుకోవాలి. వాస్తవిక అంచనాలు, లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఏదైనా పనిలో తప్పులు దొర్లితే అది చాలా సాధారణమని గుర్తుంచుకోవాలి.
పరిపూర్ణత కంటే పురోగతి ముఖ్యం:
పరిపూర్ణత కంటే పురోగతిపై దృష్టి పెట్టాలి. అలాగే తప్పులు ప్రతీ ఒక్కరి జీవితంలో సర్వ సాధారణం. తప్పులు జరగకపోతేనే కొత్తగా ఏదీ ప్రయత్నించడం లేదని అర్థం.
నో చెప్పడం నేర్చుకోవాలి:
మీరు ఒక్కరే అందరి కోరికలను, డిమాండ్లను తీర్చలేరని గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఆ పని మీ వల్ల కాదని తెలిస్తే వెంటనే నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది మీ మీద పనిభారాన్ని, ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది.
టాస్క్‌లను అప్పగించండి:
అన్ని పనులను మీరే పూర్తి చేసే భారాన్ని మీరు భరించాల్సిన అవసరం లేదు. స్నేహితులు, కుటుంబం మరియు సహోద్యోగులు, మీ భాగస్వామితో సహా మీ సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోండి. మీ పనిలో కొంత భాగాన్ని వారికి కూడా అప్పగించండి.
మిమ్మల్ని మీరు కాపాడుకోండి:
మీ శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు కోసం శ్రద్ధ వహించడానికి సమయాన్ని వెచ్చించండి. మీకు ఇష్టమైన పనులు చేయడంతో పాటు నచ్చిన వారితో ఎక్కువ సమయం గడపండి. మీకు ఆనందం కల్గించే కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టండి.
సరిహద్దులను సెట్ చేయండి:
సూపర్ ఉమెన్ సిండ్రోమ్‌ను తగ్గించుకోవడానికి సరిహద్దులను నిర్ణయించడం చాలా ముఖ్యం. మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా లేని కోరికలకు నో చెప్పడం, పని లేదా సోషల్ మీడియాపై పరిమితులను సెట్ చేయడం, మీ సమయం మరియు శక్తిని రక్షించడం వంటివి ఇందులో ఉంటాయి.
నిపుణుల సహాయాన్ని కోరండి:
సూపర్ ఉమెన్ సిండ్రోమ్, మీ ఆరోగ్యంపై దాని ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందడం మీకు సవాలుగా అనిపిస్తే.. మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సూచనలు పొందేందుకు వెనుకాడకండి.
పైన చెప్పినవన్నీ పాటించడం వల్ల సూపర్ ఉమెన్ సిండ్రోమ్ ను తగ్గించుకోవచ్చు. సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. సో మీలోనూ సూపర్ ఉమెన్ సిండ్రోమ్ ఉందో లేదా గ్రహించి ఒకవేళ ఉన్నట్లయితే వీటన్నిటి ఫాలో అయి కచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











