Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలి? ఏం తినకూడదు?
ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దీనిని మధుమేహం లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మనదేశం డయాబెటిస్ పేషెంట్లకు రాజధానిగా మారిపోయింది. ఒక్కసారి డయాబెటిస్ వస్తే దానిని నియంత్రించగలం కానీ పూర్తిస్థాయిలో నయం చేయలేం. డయాబెటిస్ పేషెంట్లు ఏది పడితే అది తినడానికి వీలు ఉండదు..వీళ్లు తినే ప్రతి ఒక్కటి ఆరోగ్యకరమైనదిగానే ఉండాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం చూపుతుంది.
అయితే చాలామంది డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయంలో తరచుగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలు డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఇక్కడ చూడండి.

ఏం తినాలి, ఏం తినకూడదో చూడండి
ఆరోగ్యకరమైన స్నాక్స్
ప్రాసెస్ చేసిన ఆహారాలను డయాబెటిస్ పేషెంట్లు అస్సలు తినకూడదు. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లేదా టిఫిన్ లోని కేలరీలను పెంచని.. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించని ఆహారాలను ఎంచుకోండి. ఇందుకోసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్( GI), మొలకెత్తిన గింజలు లేదా అవిసె గింజలతో కూడిన మఖానా వంటి ఫైబర్ అధికంగా ఉండే స్నాక్స్‌ను తీసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన నట్స్
శరీరానికి అవసరమైన మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని అందించడమే కాకుండా విటమిన్ శోషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాయంత్రం స్నాక్స్ కోసం..వాల్ నట్స్, బాదం తినడం బెస్ట్. అలాగే ఉప్పు లేని గింజలను ఎంచుకోండి, ఎందుకంటే అవి రక్తంలో చక్కెరను కూడా నియంత్రణలో ఉంచుతాయి.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు, తృణధాన్యాలు
మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటిలో చాలా గ్లూకోజ్ ఉంటుంది. కాబట్టి పండ్లలో ఆపిల్, జామ, బేరి, నారింజ వంటి తక్కువ GI పండ్లను ఎంచుకోండి. ఎల్లప్పుడూ చిన్న పరిమాణ ఆపిల్ లేదా బేరి తినడం ఉత్తమం.
ఆరోగ్యకరమైన డ్రింక్స్
శక్తిని పెంచడానికి ఒక కప్పు టీ లేదా కాఫీ మంచి ఆప్షనే అయినప్పటికీ టీ, కాఫీలలో కెఫిన్ మాత్రమే కాకుండా చక్కెర కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్యూజ్డ్ వాటర్, వేడి సూప్‌లు, కొబ్బరి నీరు లేదా స్మూతీస్ వంటి ప్రత్యామ్నాయాలను ప్రయత్నించండి..ఇవి మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచగలవు మరియు చక్కెర తీసుకోవడం తగ్గించగలవు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
