Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
వామ్మో.. ఎండలో బయటికి వెళ్తే ఇంత ప్రమాదకర చర్మ వ్యాధులు వస్తాయా? బయటపడాలంటే ఈ టిప్స్ పాటించండి!
మార్చి నెల వచ్చేసింది. దీంతో పాటు ఎండలను కూడా తెచ్చేసింది. బయట ఎండలు భగభగమండుతున్నాయి. 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలు కారణంగా ప్రజలు జంకుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలు, కూలర్లు కొనుక్కుంటున్నారు. ఎండల్లో బయటికి వెళ్లడం వలన వడదెబ్బ తగలడమే కాదు చర్మ సమస్యలు కూడా వస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల వలన చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. అయితే ఎండలో వెళ్లడం వలన ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయి? వాటిని ఏ విధంగా అరికట్టాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వడదెబ్బ:
ఎండలో ఎక్కువసేపు ఉంటే చర్మం వడదెబ్బకు గురవుతుంది. UV కిరణాలు చర్మాన్ని ఎర్రబడేలా చేసి పొట్టు ఊడిపోయేలా చేస్తాయి. దీర్ఘకాలం ఎండలో ఉంటే చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది.1
చర్మం జిడ్డుగా మారడం
ఎండాకాలం వేడి ఎక్కువగా ఉంటుంది. బయటికి వెళ్ళగానే అధిక ఉష్ణోగ్రతలు మండిపోతాయి. దీని వల్ల వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. చర్మం నుంచి వచ్చే చెమట జిడ్డుగా మారి, చర్మంపై పొడిగా నల్లగా మారుతుంది.

చర్మం పొడిబారడం:
ఎండకు సాధారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. శరీరంలోని నీరంతా బయటికి వెళ్ళిపోతుంది. దీంతో గొంతు పొడిబారడం, శరీరంలో నీటి శాతం లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఎండ వేడిమికి చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. చర్మం పొడిగా మారి, చర్మంపై పైకి లేస్తుంది.
మొటిమలు:
సాధారణంగా బయట కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దుమ్ము ధూళి వంటివి చర్మాన్ని పాడు చేస్తాయి. అయితే వీటికి తోడు ఎండా ఎక్కువ అయితే ఆ తీవ్రత కొంచెం అధికంగా ఉంటుంది. చర్మం నుంచి విడుదలయ్యే చెమటతో కలిసి దుమ్ము ధూళి మొత్తం ఒక లేయర్ మాదిరిగా చర్మంపై కూర్చుంటుంది. దీని కారణంగా చర్మంపై మొటిమలు, దద్దర్లు, చర్మంపై మంట వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
చర్మం కమిలిపోవడం
ఎండలో బయటికి వెళ్లడం వలన మొట్టమొదటగా వచ్చే సమస్య చర్మం కమిలిపోవడం. చర్మం పూర్తిగా కమిలిపోయి నల్లగా మారుతుంది. అలాగే సూర్య కిరణాల ప్రభావం వలన చర్మ రంధ్రాలు మూసుకుపోయి, చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది.
చిట్కాలు:
సన్‌స్క్రీన్ లోషన్: బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇది UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
వదులైన దుస్తులు: కాటన్ దుస్తులు ధరించడం వల్ల చెమట పీల్చుకొని చర్మం తాజాగా ఉంటుంది.
నీరు: రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
పండ్లు, కూరగాయలు: విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, దోసకాయ, కీర దోస వంటివి తీసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది.
ఐస్ ప్యాక్: ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఐస్ ప్యాక్ తో చర్మాన్ని మర్దన చేసుకోవడం వల్ల చర్మం చల్లగా ఉంటుంది.
శరీరాన్ని చల్లబరిచే ఆహారం: మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం వంటివి తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications