Latest Updates
-
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.!
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, ప్రయాణాల్లో లేదా ఇంట్లో ఉన్నప్పుడు.. ఎవరైనా అకస్మాత్తుగా కళ్లు తిరిగి కింద పడిపోవడం మనం చాలాసార్లు చూస్తుంటాం. ఆ సమయంలో చుట్టుపక్కల వారు కంగారు పడిపోయి, వెంటనే వారి ముఖం మీద నీళ్లు చల్లడం లేదా బలవంతంగా నీళ్లు తాగించడం చేస్తుంటారు. మరికొందరు వారిని లేపి కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ, మీరు చేసే ఈ చిన్న పొరపాట్లు రోగి పరిస్థితిని మరింత దిగజార్చి, ప్రాణాలకే ముప్పు తెస్తాయని మీకు తెలుసా?

ఎవరైనా స్పృహ కోల్పోయినప్పుడు భయపడకుండా సరైన ప్రథమ చికిత్స(ఫస్ట్ ఎయిడ్) అందించడమే అత్యంత కీలకమని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ రోహిత్ గుప్తా హెచ్చరిస్తున్నారు. తొలి నిమిషాల్లో మనం తీసుకునే సరైన నిర్ణయమే వారిని పెద్ద ప్రమాదం నుంచి బయటపడేస్తుంది. మరి ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో డాక్టర్ గుప్తా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియోలో తెలిపారు.
మొదట చేయాల్సిన పనులు ఇవే
మీ కళ్ల ముందే ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే, ముందుగా మీరు ప్రశాంతంగా ఉండండి. వారి దగ్గరకు వెళ్లి భుజంపై మెల్లగా తడుతూ, పేరు పెట్టి పిలుస్తూ స్పందన ఉందో లేదో గమనించండి. వారు పలకకపోతే వెంటనే వారిని నేలపై వెల్లకిలా పడుకోబెట్టండి. ఆ తర్వాత వారి రెండు కాళ్లను కొద్దిగా పైకి లేపి ఉంచండి (కాళ్ల కింద దిండు లాంటిది పెట్టొచ్చు).
ఇలా చేయడం వల్ల గుండె నుంచి మెదడుకు రక్త ప్రసరణ వేగంగా జరిగి, వారు త్వరగా స్పృహలోకి వస్తారు. అలాగే ఆ వ్యక్తి చుట్టూ జనం గుమిగూడకుండా, స్వచ్ఛమైన గాలి తగిలేలా చూడాలి. రోగి మెడ చుట్టూ బిగుతుగా ఉండే టై, కాలర్ బటన్స్, లేదా నడుముకు ఉన్న బెల్ట్ వంటివి వెంటనే వదులు చేయండి. దీనివల్ల వారు శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది.
పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
అపస్మారక స్థితిలో ఉన్నవారికి నీళ్లు, జ్యూస్ లాంటివి తాగించడం లేదా మందులు వేయడం మనం చేసే అతిపెద్ద తప్పు. స్పృహ లేని వారు వాటిని మింగలేరు కాబట్టి, ఆ ద్రవాలు నేరుగా శ్వాసనాళాల్లోకి వెళ్లిపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. అలాగే కింద పడిపోయిన వ్యక్తిని హడావుడిగా నిలబెట్టడానికి లేదా కూర్చోబెట్టడానికి ప్రయత్నించకండి. త్వరగా కోలుకుంటారని ఇలా చేస్తారు కానీ, దీనివల్ల వారు మళ్లీ పడిపోయి తలకు గాయాలయ్యే ముప్పు మరింత పెరుగుతుంది.

శ్వాస ఆడుతోందో లేదో గమనించండి
స్పృహ కోల్పోయిన వ్యక్తి సాధారణంగా గాలి పీల్చుకుంటున్నారో లేదో ఛాతీ కదలికల ద్వారా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నా, లేదా గాలి ఆడకపోయినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీపీఆర్(CPR) ప్రారంభించాలి. ఒకవేళ మీకు సీపీఆర్ చేయడం పట్ల అవగాహన లేకపోతే, వెంటనే అంబులెన్స్ కు (108) ఫోన్ చేసి, వైద్య సహాయం అందేలా చూడాలి.
హాస్పిటల్ కు ఎప్పుడు తీసుకెళ్లాలి?
సాధారణంగా నీరసం వల్ల కళ్లు తిరిగి పడిపోయిన వారు నిమిషంలోపు కోలుకుంటారు. కానీ, ఒక నిమిషం కంటే ఎక్కువ సేపు స్పృహ రాకపోయినా, పదేపదే కళ్లు తిరుగుతున్నా దానిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. స్పృహ వచ్చాక కూడా ఛాతీ నొప్పిగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరంలో ఏదైనా భాగం చచ్చుబడినట్లు లేదా బలహీనంగా అనిపించడం, తలకు బలమైన గాయం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. కళ్లు తిరిగి పడిపోవడం అనేది కేవలం నీరసం వల్లనే కాదు.. గుండె, మెదడు లేదా ఇతర నరాలకు సంబంధించిన తీవ్రమైన సమస్యలకు ముందస్తు సంకేతం కూడా కావచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications