Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఏ వయసు ఎలాంటి హెల్త్ చెకప్ చేసుకోవాలో తెలుసా?.. డాక్టర్లు చెబుతున్నది ఇదే!
ఆరోగ్యంగా జీవించాలంటే, ఆరోగ్యపరమైన శ్రద్ధ మాత్రమే కాకుండా, సమయానికి హెల్త్ చెకప్స్ చేయించుకోవడం కూడా ఎంతో అవసరం. ముందుగానే సమస్యలను గుర్తించేందుకు ఇవి సహాయపడతాయి. అలాగే, జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఈ కారణంగా వైద్య నిపుణులు ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకూ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే, వయస్సు ఆధారంగా ఏ టెస్టులు అవసరం అవుతాయో చాలామందికి తెలియదు. కాబట్టి, వయసు వారీగా ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలో చూద్దాం..
0-12 సంవత్సరాలు:
సాధారణంగా ఈ వయస్సులో పిల్లల ఎదుగుదల (ఎత్తు, బరువు) మరియు పోషణ స్థాయికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. వారికి అత్యంత ముఖ్యమైనవి కూడా ఇవే. అందుకే వారికి కంటి ఆరోగ్యం, పళ్ల ఆరోగ్యం వంటి మౌలిక పరీక్షలు కూడా చేయించుకోవాలి.

12-18 సంవత్సరాలు:
చదువు వల్ల, పరీక్షల వల్ల 12 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులకు ఎక్కువగా ఒత్తిడికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. అలాగే టీనేజర్స్‌లో ఈ ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే థైరాయిడ్, బీపీ, షుగర్, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై పరీక్షలు చేయించుకోవాలి.
20-29 సంవత్సరాలు:
ఇక్కడి నుంచి ఎక్కువ సమస్యలు మొదలవుతుంటాయి. ఈ వయస్సులో చాలా మందికి లైఫ్‌స్టైల్ సమస్యలు మొదలవుతాయి. డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత టెస్టులు, ఈసీజీ, లైంగిక ఆరోగ్యం సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
30-39 సంవత్సరాలు:
ఇటీవలి కాలంలో ఈ వయస్సులో గర్భధారణ, కెరీర్ ఒత్తిడి వంటి అంశాలు ముఖ్యమైనవిగా మారాయి. పై టెస్టులతో పాటు కంటి చూపు, చర్మ సమస్యలు, ప్రసవ సంబంధమైన పరీక్షలు అవసరం. మహిళలు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ వయసులో ఈ సంవత్సరాల్లో ఉన్న వ్యక్తులు ఈ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
40-49 సంవత్సరాలు:
సాధారణంగా ఈ వయసు నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు తప్పనిసరి. లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు, థైరాయిడ్, కంటి పరీక్షలు చేయించుకోవాలి. మహిళలు బోన్ డెన్సిటీ పరీక్షలు చేయించుకోవాలి, పురుషులు ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవాలి.
50-64 సంవత్సరాలు:
హృదయ సంబంధిత స్క్రీనింగ్, పెద్దపేగు పరీక్షలు, మమ్మోగ్రామ్, బోన్ డెన్సిటీ, వినికిడి పరీక్షలు, కంటి ఆరోగ్యం వంటి టెస్టులు ఈ దశలో కీలకం.
65 సంవత్సరాల పైబడినవారు:
పాత ఆరోగ్య సమస్యలపై క్రమంగా టెస్టులు చేయించుకోవడం అవసరం. అల్జీమర్స్ వంటి మానసిక రుగ్మతల గురించి కూడా పరిశీలించాలి.
ఎంత తరచుగా చెకప్స్ చేయించుకోవాలి?
ఈ ఆరోగ్య పరీక్షలను ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి సాధారణ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యల ఆధారంగా లేదా కుటుంబంలో ఉన్న అనారోగ్య చరిత్రను బట్టి వైద్యుల సలహా మేరకు చెకప్ షెడ్యూల్ మార్చుకోవచ్చు. హెల్త్ చెకప్స్ ఖర్చుతో కూడుకున్నవే అయినా, ముందస్తుగా గుర్తించిన సమస్యలు మానవ జీవితాన్ని రక్షించగలవు. కాబట్టి, నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య పరీక్షలు సమయానికి చేయించుకోవడం తప్పనిసరి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications