Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
Curd rice: చలికాలంలో పెరుగన్నం తింటున్నారా? తింటే ఏమవుతుందో తెలుసా?
పెరుగన్నం ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. సులభంగా అరిగిపోవడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. పెరుగన్నం రోజూ తినడం వల్ల దీర్ఘ కాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇందులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంతో పాటు, శక్తిని అందిస్తాయి. అయితే చలికాలంలో పెరుగు తినకూడదని కొందరు చెబుతుంటారు. చలికాలంలో పెరుగు తినడం వల్ల ఏమవుతుంది? పెరుగు తింటే ఎలాంటి ప్రయోజనాలు దొరుకుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగులో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే?
పెరుగును పోషకాల గని అని చెప్పుకోవచ్చు. ఇందులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటితో పాటు ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్ B12, రిబోఫ్లావిన్ , ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులు ఈ పెరుగును తినడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. దీంతో పాటు ఎముకల బలపడతాయి. దంతాలు కూడా ధృడంగా తయారవుతాయి.

పెరుగన్నం వల్ల కలిగే ప్రయోజనాలు
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
పెరుగు అన్నంలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్య వంతమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని ధృడంగా మారుస్తాయి. రోగ నిరోధక శక్తి పెరగడంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాము. అలాగే సకల వ్యాధులతో పోరాడేందుకు కావాల్సిన శక్తి అందుతుంది.
ఎముకలు, దంతాలకు బలం
పెరుగు అన్నంలో క్యాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే దంతాలు కూడా బలంగా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు, ఆర్థోపెడిక్ వైద్యులు సూచిస్తున్నారు.
బరువు నియంత్రణకు
ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే పెరుగన్నం తినడం వల్ల బరువును నియంత్రణలో పెట్టుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుందని ఇది తినడం వల్ల సులభంగా అరిగిపోతుందని చెబుతున్నారు. అలాగే ఆకలి కూడా అంత తొందరగా వేయడాన్ని, తద్వారా బరువు కూడా తగ్గుతారని పేర్కొంటున్నారు. బరువు తగ్గాలని అనుకునే వ్యక్తులు తమ డైట్‌లో పెరుగును జత చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందొచ్చని చెబుతున్నారు.
జీర్ణ వ్యవస్థకు మేలు
పెరుగులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని త్వరగా అరిగే విధంగా చేస్తుంది. అలాగే ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అసిడిటీ, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
