Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.!
చర్మం నిగనిగలాడాలా..అయితే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే..!
కొంత మంది శరీరంలో త్వరగా డ్రై అయిసోతూ వుంటుంది. బయట వాతావరణం అసౌకర్యంగా అనిపిస్తుంది. చలికాలం, ఎండా కాలమనే బేధం లేకుండా అన్ని కాలాల్లో ఈ చర్మం పొడిపొడిగా మారుతూ వుంటుంది. అలవాట్లు, ఆహార నియమాల్లో మార్పులు చేయడం వల్ల డ్రైనెస్ ఎక్కువగా తెలుస్తూ వుంటుంది. బయట వుండే వాతావరణాన్ని తట్టుకునే విధంగా మన చర్మం వుండాలి, అప్పడే స్కిన్ ఆరోగ్యంగా డ్రైగా వుండకుండా వుంటుంది. చర్మం నాచురల్ ఆయిల్స్‌ను విడుదల చేస్తూ వుంటుంది. ఆ ఆయిల్స్ స్రవించకపోవడం వల్ల కూడా సమస్య వస్తుంది. అవి తయారు కవవడానికి కావాల్సిన పోషకాలను మనము అందించకపోవడం వల్ల కూడా ఇలాంటి చర్మ సమస్యలు వస్తాయ్.

చర్మంలో పొడితనం పోవాలంటే ముందుగా నీరు ఎక్కువగా తాగాలి. అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీళ్లు తక్కువగా తాగే వారిలో స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా వుంటుంది. రోజుకు కనీసం 4 లీటర్ల మంచినీరైనా తప్పకుండా తాగాలి. ఉదయం లేవగానే లీటరు పావు నీళ్లను తాగాలి. 11 గంటల లోపు మరో లీటరు తాగితే మధ్యాహ్నం వరకు రెండు లీటర్ల నీరు తాగినవారౌతారు. బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగవద్దు. భోజనం చేసేటప్పుడు కూడా నీళ్లు తాగవద్దు. భోజనం చేసిన రెండు గంటల తరువాత మాత్రమే నీళ్లను అప్పుడప్పుడూ ఒక గ్లాసు తాగాలి. ఇలా రోజుకు 4 లీటర్ల నీళ్లను తాగాలి. రోజూ ఇలా చేస్తే మీ చర్మం ఎప్పుడూ నిగనిగలాడుతూ, మృదువుగా అవుతుంది.
రెండు చుక్కల నెయ్యి అరచేతికి రాసుకొని చేతులకు కాళ్లకు అప్లై చేసుకొని బయటకు వెళ్లాలి. మంచి క్వాలిటీ నెయ్యిని తెచ్చుకుంటే అది చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. నెయిలేకపోతే కొబ్బరి నూనె అయినా రాసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్‌ను రాసుకుంటే కూడా జిగురు లేకుండా వుంటుంది. వారానికి ఒకసారి స్టీమ్ బాత్, సోనా బాత్ లాంటివి తీసుకుంటే ఆయిల్ గ్లాండ్స్ బాగా వృద్ధి చెందుతాయ్. స్కిన్ టోన్ బాగా పెరగాలంటే విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువ కావాలి. క్యారెట్, బీట్‌రూట్, టమాట, ఖీర కలిపిన జ్యూస్‌లను తీసుకోవాలి. రెగులర్‌గా రెండు జ్యూస్‌లు తాగితే చర్మం ఆరోగ్యంగా వుండి కావాల్సిన పోషకాన్నీ అందుతాయ్.

కొంచెం అలోవెరాను తీసుకొని, రోస్ వాటర్‌లో కలుపుకొని అందులో విటమిన్ సి క్యాప్సల్స్‌ని కలిపితే స్కిన్ టైటెనింగ్‌కి బాగా ఉపయోగపడుతుంది. చర్మం కింద వున్న కొల్లాజన్‌ను లూజ్ అవకుండా ఈ విటమిన్ సి క్యాప్సల్ కాపాడుతుంది.
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయ్. పసుపు పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. స్నానానికి వెళ్లే ముందు కొబ్బరి నూనెను రాసుకోవాలి. తడి టవల్‌తో శరీరం మొత్తం రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంపైన వున్న మురికి మొత్తం పోతుంది. ఈ టెక్నిక్‌ను చలికాలం ఉపయోగిస్తే మంచి ఫలితం వస్తుంది.
చర్మాన్ని ఐదు రకాలుగా చెబుతుంటారు. నార్మల్, డ్రై, సెన్సిటివ్, ఆయిలీ, కాంబినేషన్ స్కిన్ అని ఐదు రకాలుగా స్కిన్ వుంటుంది. ఒక్కో స్కిన్ టైప్‌కు ఒక్కో రకంగా కేర్ తీసుకోవాల్సి వుంటుంది. పొడి చర్మం వున్న వాళ్లు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications