Latest Updates
-
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.!
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.?
మార్కెట్‌లో చాలా రకాల వంట నూనెలు అందుబాటులో ఉంటాయి. ఇక ఆర్గానిక్, కోల్డ్ ప్రెస్‌డ్, రిఫైన్‌డ్ ఇలా పలు విధానాలతో చేసిన కుకింగ్ ఆయిల్స్ సైతం ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వంటకు తమ ఇష్టమైన ఆయిల్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక, ప్రకటనల ఆధారంగా మంచి వాటిని చూసి ఎంచుకుంటారు. అయితే ప్రతి నూనెలోనూ కొన్ని పోషక గుణాలు ఉంటాయి. మన శరీర అవసరాలకు అనుగుణంగా కుకింగ్ ఆయిల్స్‌ను ఎంచుకోవడం ఉత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిస్థితులు, వయసు, ఆహారపు అలవాట్లు, వంట పద్ధతి ఆధారంగా వంట నూనెను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని సందర్భాల్లోనూ ఒకే రకమైన ఆయిల్ వాడటం ఉత్తమం కాదని చెబుతున్నారు. మీమీ ఆరోగ్యాన్ని, ఇంటి అలవాట్లను దృష్టిలో ఉంచుకుని ఏ వంట నూనె ఉత్తమమైనది, దాని ప్రయోజనాలు ఏంటి.? తెలుసుకుందాం.?
ఆవ నూనె
మన సాంప్రదాయ వంటకాల్లో ఆవ నూనెను అనాది కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఆవ నూనెలో అధిక స్మోక్ పాయింట్ కూడా ఉంటుంది. అందుకే ఇది డీప్ ఫ్రైయింగ్, సాధారణ వంట రెండింటికీ అనుకూలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

వేరుశెనగ నూనె
వేరుశెనగ నూనెలో విటమిన్ ఇతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అధిక వేడితో వంట చేసేటప్పుడు ఈ నూనె మంచి ఆప్షన్. వేపుడు పదార్థాలకు, పెనంపై, లేదా పొయ్యిపై కాల్చే ఆహార పదార్థాలకు వంట నూనె సరైన ఎంపిక.
ఆలివ్ నూనె
ఆలివ్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల సలాడ్‌లలో ఉపయోగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కూరలకు, నాన్‌వెజ్‌కి మసాలా డ్రెస్సింగ్ కోసం ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె మంచి ఆప్షన్. కాగా, శుద్ధి చేసిన ఆలివ్ నూనెను సాధారణ వంటకు ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
రైస్ బ్రాన్ ఆయిల్
బియ్యం తవుడు నుంచి చేసే నూనెను రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు. ఇందులో ఒరిజనాల్ అనే సమ్మేళనం ఉన్న కారణంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. అధిక స్మోక్ పాయింట్ కూడా ఎక్కువే. అందుకే మన వంటకాలకు రైస్ బ్రాన్ ఆయిల్ మంచి ఆప్షన్‌గా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
నువ్వుల నూనె
ఆరోగ్య ప్రదాయిని నువ్వుల నూనెలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉన్న కారణంగా ఎంతో మేలు చేకురుతుంది. ముఖ్యంగా దక్షిణ భారత, ఆసియా వంటకాల్లో నువ్వుల నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనెను మితంగా తీసుకోవాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనె మన దేశ సాంప్రదాయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో సంతృప్త కొవ్వు స్థాయిల కారణంగా దీనిని మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక పరిమాణంలో తీసుకోకూడదు.
మీమీ శరీర అవసరాలు, ఇంటి అవసరాలను బట్టి వంట నూనెను ఎంచుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారు రోజులో 30 గ్రాముల వరకు నూనె తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నూనెను మళ్లీ వేడి చేయడం, తిరిగి ఉపయోగించడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications