Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
Tea or Coffee: టీ, కాఫీ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? ఖచ్చితంగా అదే
మనదేశంలో చాలామందికి పొద్దున్నే నిద్ర లేవగానే టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి టీ లేదా కాఫీ తాగకపోతే ఉదయాన్నే మోషన్ కాదు అని చెబుతుంటారు. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రాలో అయితే చాలామంది రోజులో 10 కప్పుల పైనే కాఫీ లేదా టీ తాగుతుండటం చాలాసార్లు గమనించి ఉంటాం. ఉద్యోగులు కూడా ఆఫీసు పనివేళ్లల్లో ఒక షిఫ్ట్ లో 5 సార్లు పైనే టీ లేదా కాఫీ తాగుతుంటారు.ఏడాది పొడవునా టీ తాగినప్పటికీ, శీతాకాలంలో కాఫీ పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు.
టీ, కాఫీల మధ్య బెస్ట్ రేసులో ఏది ముందు అనే చర్చ తరచూ జరుగుతుంటది. అయితే టీ, కాఫీ రెండింటిలో ఏది బెస్ట్? ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది? ఈ విషయాలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ అయితే ఇలా
వాస్తవానికి కాఫీలో తగినంత కెఫిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం క్రమం తప్పకుండా కాఫీ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, పిత్తాశయ రాళ్లు, పార్కిన్సన్స్ వంటి సంక్లిష్ట వ్యాధులను నివారించవచ్చు. అదీకాక కాఫీ ఒక్కటే నూటికి నూరుపాళ్లు మూడ్ బూస్టింగ్ అని నిపుణులు చెబుతుంటారు
టీ అయితే ఇలా
టీలో ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ రకాల హృదయ సంబంధ వ్యాధులను నివారించవచ్చు. టీ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణ నుండి బరువు తగ్గడం, క్యాన్సర్ నివారణ వరకు ప్రతిదానితో సంబంధం కలిగి ఉంటుంది. కాఫీలాగే టీకి కూడా మానసిక స్థితిని మెరుగుపరిచే శక్తి ఉంది. కాబట్టి కాసేపు పని చేస్తూ టీ తాగితే శక్తి వస్తుంది. మీరు రక్తపోటును తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించినట్లయితే టీ బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
టీ, కాఫీ లో బెస్ట్ ఇదే
టీ, కాఫీ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కాఫీలో టీ కంటే దాదాపు రెట్టింపు కెఫిన్ ఉంటుంది. అందువల్ల కాఫీ త్వరిత శక్తిని ఇస్తుంది కాబట్టి మలబద్ధకం, థైరాయిడ్ వంటి అనేక శారీరక సమస్యలలో కాఫీని తక్కువగా తీసుకోవడం మంచిది. అయితే టీ, కాఫీలలో ఏది తాగినా పాలు, పంచదార లేకుండా తాగడం మంచిది. ముఖ్యంగా ఉదయం పూట పాలు, చక్కెరతో కూడిన టీ, కాఫీని డాక్టర్లు నిషేధించారు. బదులుగా మీరు లిక్కర్ టీ లేదా బ్లాక్ కాఫీని తాగడం మంచిదని చెబుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications