Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అందరూ చేస్తున్న తప్పు ఇదే.. ఇలాంటి బ్రష్ వాడితే తొందరగా పోతారు!
ఉదయాన్నే లేవగానే ప్రతి ఒక్కరూ చేసే పని పళ్ళు తోముకోవడం. ఈ పళ్ళు తోముకోవడానికి చాలా మంది రకరకాల టెక్నిక్స్ వాడుతుంటారు. పల్లెటూర్లలో వేప పుల్లలు వినియోగిస్తే, పట్టణాల్లో ఎక్కువగా బ్రష్ వినియోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం మనం ఉపయోగించే బ్రష్ లలో అనేక రకాలు ఉన్నాయి.
వాటిలో హార్డ్, మీడియం, సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్నవి. చాలామంది హార్డ్ బ్రష్‌లను వాడి పళ్ళను శుభ్రం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ, వైద్యులు చెబుతున్నదేమిటంటే, ఈ హార్డ్ బ్రష్‌లు మీ పళ్ళను నాశనం చేయడమే కాకుండా, అనేక సమస్యలను కలిగిస్తాయని చెబుతున్నారు. అసలు ఎలాంటి బ్రష్ వాడాలి? హార్డ్ బ్రష్ వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హార్డ్ బ్రిసిల్స్ బ్రష్ వాడకూడదు
హార్డ్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ వాడడం వల్ల పళ్ళపై చీలికలు పడతాయి. చిగుళ్లలో పగుళ్లు రావొచ్చు. ఇవి పళ్ళకి నష్టం కలిగించడమే కాక, నోటికి సంబంధించి సున్నితమైన భాగాలకు కూడా గాయం చేయొచ్చు. పైగా, వీటి వలన పళ్ళ సందుల్లోని మురికి పూర్తిగా తొలగిపోదు. ఇప్పటికే చాలా మంది వైద్యులు, డెంటిస్టులు సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌లను వాడటం మంచిది అని సూచిస్తున్నారు. ఇవి పళ్ళ సందుల్లోకి బాగా చేరి, మురికి, బ్యాక్టీరియాలను తీసేస్తాయి. పళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు నోటిని కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
అది మాత్రమే కాదు..
అయితే, పళ్ళను శుభ్రం చేసే క్రమంలో కేవలం బ్రష్ రకమే కాదు, బ్రష్ వాడే విధానంపై కూడా దృష్టి పెట్టాలి. ప్రతి బ్రష్ వాడే సమయంలో ఒత్తిడి లేకుండా, సున్నితంగా బ్రష్ చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, రోజూ కనీసం రెండుసార్లు పళ్ళను తోముకోవడం, అలాగే డెంటల్ ఫలాస్ ఉపయోగించడం కూడా పళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం.
అందుకే, సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ వాడటం, క్రమం తప్పకుండా పళ్ళను శుభ్రం చేయడం, ఆహారంలో సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, బాగా నీళ్ళు తాగడం చేస్తుండాలి. ఇవి క్రమం తప్పకుండా రోజూ చేయడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications