Latest Updates
-
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.!
ప్రధాని మోదీ ప్రకారం.. ఎలాంటి వంట నూనె వాడాలి? ఎలాంటి వంట నూనె వాడకూడదు తెలుసా?
ప్రస్తుతం ఏదైనా వండాలంటే దానికి కచ్చితంగా నూనె కావాల్సిందే. నూనె లేకపోతే ఏ వంటకం కూడా పూర్తి కావడం లేదు. కూరల కోసమనే కాదు, ఫ్రై చేసుకోవడానికి కూడా నూనె తప్పనిసరిగా ఉండాల్సిందే. కొందరైతే నూనెను కూరపైకి తేలే విధంగా వేసుకొని మరీ తింటూ ఉంటారు. అంతలా మనిషి రోజువారీ జీవితంలో నూనె అనేది అంతర్లీనమైపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది కొన్ని రకాల నాసి రకమైన నూనెలను వినియోగిస్తే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీనిపై ప్రధాని మోదీ సైతం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టోరీలో ఎలాంటి వంట నూనె వినియోగించకూడదు? వినియోగిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాడకూడని నూనెలు
పాక్షికంగా హైడ్రోజనీకరణం చేసిన నూనెలు:
పాక్షికంగా హైడ్రోజనీకరణం చేసిన నూనె అస్సలు వినియోగించకూడదు. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ పెంచి, మంచి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్స్, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

రీఫైన్డ్ నూనెలు:
ఈ నూనెలను శుద్ధి చేసే ప్రక్రియలో అధిక వేడి, రసాయనాలు వాడతారు. దీనివల్ల నూనెల్లో ఉండే సహజ పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. కొన్ని రీఫైన్డ్ నూనెల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో మంట పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. అందుకే కొన్ని రకాల నూనెలను వినియోగించుకోవడం మానేస్తే మంచిది.
పామ్ ఆయిల్:
వాడకూడని నూనె రకాల్లో పామ్ ఆయిల్ కూడా ఒకటి. దీనిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ పెంచి గుండె జబ్బులకు కారణం అవుతాయి. అలాగే సులభంగా బరువు పెరిగిపోవడం రక్త నాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి.
కాటన్ సీడ్ ఆయిల్:
ఈ నూనెని తయారుచేసే ప్రక్రియలో అధిక రసాయనాలు వినియోగిస్తారు. దీనివల్ల ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులోని రసాయనాలు శరీరానికి హాని చేయడంతో పాటు అనేక రకాల దీఘకాలిక సమస్యలకు కారణమవుతాయి. అలాగే దీనివల్ల గుండెజబ్బులు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటికి దూరంగా ఉండడం మంచిది.
కొన్ని రకాల వేరుశనగ నూనెలు:
కొన్ని రకాల వేరుశనగ నూనెల్లో ఎఫ్లాటాక్సిన్స్ అనే విషపూరితమైన పదార్ధాలు ఉంటాయి. ఇవి కాలేయానికి హాని చేస్తాయి. అలాగే వీటి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే బరువు పెరిగిపోవడం, ఉభయకాయం వంటి ఆందోళనకరమైన సమస్యలు వస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది.
ఇవి వాడడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు:
గుండె జబ్బులు
మధుమేహం
ఊబకాయం
క్యాన్సర్
శరీరంలో మంట
కాలేయ సమస్యలు
ఏ నూనెలు వాడాలి?
వేరుశనగ నూనె
నువ్వుల నూనె
ఆవనూనె
కొబ్బరి నూనె
ఆలివ్ నూనె
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications