Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే!
ఆరోగ్యంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేసే మొదటి పని మంచి పోషక విలువలున్న ఫుడ్ తినడం. ఈ క్రమంలో మనందరికీ ఫస్ట్ గా గుర్తొచ్చేవి డ్రై ఫ్రూట్స్. బాదం, వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ కేవలం రుచికరమైనవే కాదు, మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలకు నిలయాలు. అయితే అమృతాన్ని అయినా అతిగా తీసుకోకూడదు అన్న సామెత డ్రై ఫ్రూట్స్ కు కచ్చితంగా సరిపోతుంది.

డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, క్యాలరీలు (శక్తి) కూడా భారీగానే ఉంటాయి. కాబట్టి వీటిని సరైన మోతాదులో తీసుకోవడం అత్యంత ముఖ్యం.
డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినాలి? వాటి అద్భుత ప్రయోజనాలు
గుండె పదిలం
బాదం, వాల్ నట్స్, జీడిపప్పులలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను (LDL) తరిమికొడతాయి. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించి, మీ గుండెను భద్రంగా కాపాడతాయి.
చురుకైన మెదడు
వాల్ నట్స్, బాదంలో ఉండే విటమిన్ E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మీ మెదడుకు అద్భుతమైన టానిక్ లా పనిచేస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడమే కాకుండా మెదడు చురుకుదనాన్ని రెట్టింపు చేస్తాయి.
ఉక్కు లాంటి ఎముకలు
డ్రై ఫ్రూట్స్ లో కాల్షియం, మెగ్నీషియం, ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను ధృడంగా మార్చడమే కాకుండా, కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు తోడ్పడతాయి.
రోజంతా ఎనర్జీ
ఉదయాన్నే నీరసంగా అనిపిస్తోందా? డ్రై ఫ్రూట్స్ మీకు రోజంతా సరిపడా స్థిరమైన శక్తిని ఇస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, చిరుతిళ్ళు తినాలనే కోరికను తగ్గిస్తాయి.
వృద్ధాప్యానికి బ్రేక్ - రోగనిరోధక శక్తికి బూస్ట్
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుని, చర్మాన్ని, జుట్టును నిగనిగలాడేలా చేస్తాయి. అలాగే మన శరీర రోగనిరోధక వ్యవస్థను ఉక్కులా మారుస్తాయి.
రోజుకు ఎంత తినాలి?
డ్రై ఫ్రూట్స్ అధిక కేలరీలు కలిగిన ఆహారాలు కాబట్టి అతిగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం.. పెద్దలు రోజుకు 20 నుండి 30 గ్రాముల డ్రై ఫ్రూట్స్ (అంటే సుమారుగా ఒక చిన్న గుప్పెడు) తీసుకుంటే సరిపోతుంది. వీటిని మీరు స్నాక్స్ గా తినవచ్చు, లేదా స్మూతీస్, సలాడ్స్ లో కలుపుకుని ఆస్వాదించవచ్చు.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సాధారణ ఆరోగ్యవంతులకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ సరిపోయినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు వాటిని తీసుకునే విధానంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.
అధిక రక్తపోటు (బీపీ)
అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు చల్లి వేయించిన డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి. వాటిలోని సోడియం బీపీని మరింత పెంచుతుంది కాబట్టి, ఉప్పు లేని సాదా గింజలనే ఎంచుకోవాలి.
డయాబెటిస్
ఎండు ద్రాక్ష, ఖర్జూరం, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్త వహించాలి. వీటిలో సహజ చక్కెరలు ఎక్కువ కాబట్టి, షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
కిడ్నీ సమస్యలు
మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు పొటాషియం ఎక్కువగా ఉండే బాదం, జీడిపప్పులను డాక్టర్ సలహా మేరకే పరిమితంగా తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications