డేంజర్ బెల్స్.. ఏప్రిల్‌లో భారీగా పెరుగుతున్న ఆ రోగాలు, ఈ టిప్స్ పాటించకపోతే మీరు కూడా ఢమాల్!

ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఆరంభంలోనే తమ ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టాయి. మార్చి నుంచే ఎండ తీవ్రంగా భారీగా పెరిగిపోయింది. అయితే ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు చాలా మందికి జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్లూ విస్తృతంగా వచ్చేస్తుంటాయి. ఇవి సాధారణంగా చల్లని కాలంలో ఎక్కువగా కనిపించే రుగ్మతలే అయినప్పటికీ, ఈసారి వేసవిలోనూ ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్నాయి. దీనికి కారణాలు వాతావరణ మార్పులు, జీవనశైలిలోని తేడాలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోగాలు ఎందుకు వస్తాయి, ఏప్రిల్‌లో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడడానికి కారణం ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాతావరణ అసమతుల్యత ప్రధాన కారణం

ఈ నెలలో వాతావరణంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట భరించలేనంత ఎండ, రాత్రివేళల్లో చల్లదనం, అప్పుడప్పుడు వచ్చే మేఘాలు లేదా తేలికపాటి వర్షాలు శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థను అసమతుల్యంలోకి నెట్టేస్తున్నాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల మన శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, ఫలితంగా వైరల్ ఇన్‌ఫెక్షన్లకు ముప్పు పెరుగుతుంది.

Why do a lot of people fall sick in April And how to get rid out it

కాలుష్యం.. ఇంకొక పెద్ద సమస్య

శీతాకాలం ముగిసినా, గాలి కాలుష్యం మాత్రం తక్కువ కాలేదు. నిర్మాణ కార్యకలాపాలు, రోడ్డు ధూళి, పొలాల్లో మండే పొడి గడ్డి వంటివి గాలిలో దుమ్ము తలెత్తేలా చేస్తున్నాయి. దీనివల్ల గొంతు, ముక్కు, శ్వాస మార్గాల్లో జల్లుబు మరియు ఇన్‌ఫెక్షన్లకు అవకాశం ఎక్కువవుతోంది.

వేసవిలో మారిన జీవనశైలి ప్రభావం

ఎండ తీవ్రత పెరగగానే శరీరానికి చల్లదనం ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామంది శీతలపానీయాలు, ఐస్‌క్రీములు అధికంగా తీసుకుంటున్నారు. అలాగే ఎసీ గదుల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రతలో అకస్మాత్తు మార్పులు ఏర్పడి, శరీరం దీనికి తేలికగా స్పందించలేకపోతుంది. ఇది గొంతు ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తోంది.

రోగనిరోధక శక్తిపై గ్రీష్మ ఋతువు ప్రభావం

చలికాలంలో శారీరక శ్రమ తక్కువగా, ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. ఈ ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతోంది. వేసవిలో ఒక్కసారిగా వేడి పెరగడంతో శరీరం అలసిపోయే స్థితికి చేరుతుంది. ఈ సమయానికే వైరస్‌లు దాడికి దిగుతాయి.

ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్

శరీర హైడ్రేషన్: ఎక్కువగా నీరు తాగండి. ఓఆర్ఎస్, నిమ్మరసం వంటి సహజ ఐసోటోనిక్ పానీయాలు మేలు చేస్తాయి.
ఆవిరి పట్టడం: రోజు లోనోసారి నీటి ఆవిరి తీసుకుంటే శ్వాస మార్గాల్లోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్ C ఉన్న నిమ్మకాయలు, ఉసిరికాయలు, పచ్చి కూరగాయలు, అల్లం, వెల్లుల్లి వంటివి తరచూ తీసుకోవాలి.
మాస్క్ ఉపయోగించడం: దగ్గు, జలుబుతో బాధపడుతుంటే మాస్క్ ధరించడం ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు.
వెనెపడే సూచనలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే, జ్వరం 2 రోజులకు మించినపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
చల్లని ఆహారాలకు దూరం: సీజనల్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నపుడు ఐస్‌క్రీమ్, చల్లటి పానీయాలు నివారించటం మంచిది.

చివరగా..

ఏప్రిల్ నెలలో వాతావరణం ఒక్కసారిగా మారడం వల్ల శరీర ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇది ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. శక్తివంతమైన రోగనిరోధక వ్యవస్థ, సానుకూల జీవనశైలి, శుభ్రత పాటించటం వంటి అలవాట్లతో ఇలాంటి అనారోగ్య పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, April 15, 2025, 9:50 [IST]
Desktop Bottom Promotion