Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
మీ అండర్‌వేర్ ఆరెంజ్ రంగులోకి మారుతుందా?.. దీనికి కారణం ఏంటో తెలుసా, ఇది ప్రమాదకరమా?
మనమందరం కచ్చితంగా లో దుస్తువులు దరిస్తుంటాము. అవి లేకపోతే అదేదో అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. అయితే ఆ లోదుస్తువులను కొన్ని రోజులు వాడిన తరువాత అవి రంగు మారిపోతుంటాయి. కింది ప్రాంతంలో ఒకరకమైన రంగులోకి మారిపోతుంది. అయితే మీ లోదుస్తులు తరచుగా రంగు మారడం మీరు గమనిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఎందుకంటే లోదుస్తులు రంగు మారితే మీకు మీరు త్వరలోనే అనారోగ్యం బారిన పడబోతున్నారనేదానికి సంకేతం. త్వరలోనే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయని సంకేతం. అందుకే ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఈ స్టోరీలో లోదుస్తులు ఎందుకు రంగు మారుతాయి? అది దేనికి సంకేతం? ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
లోదుస్తుల రంగు ఎందుకు మారుతుంది?
మీ లోదుస్తుల రంగు మారడానికి ప్రధాన కారణం మీ జననేంద్రియాల నుండి విడుదలయ్యే స్రావం. ఇది పీరియడ్స్ సమయంలో మాత్రమే కాకుండా, సాధారణంగా రోజుల్లో కూడా జరుగుతుంది. ఈ స్రావం మీ లోదుస్తులపై నారింజ లేదా పసుపు రంగు మచ్చలు ఏర్పడడానికి కారణమవుతుంది. ఇలా రంగులు ఏర్పడినప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఇది ఎదో చెడు సంకేతంగా భావించకూడదు. నిజానికి, ఇది మీ జననేంద్రియ ఆరోగ్యాన్ని సూచించే ఒక సహజ సంకేతం.

రంగు మారడం మంచిదా కాదా?
మీ లోదుస్తుల రంగు మారడం మంచి సంకేతమే! ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ దీనికి కారణం మీ జననేంద్రియ యొక్క సహజ ఆమ్లత. సాధారణంగా, ఆరోగ్యకరమైన జననేంద్రియం యొక్క pH స్థాయి 3.8 నుండి 4.5 మధ్య ఉంటుంది. అంటే అది ఆమ్లంగా ఉంటుంది. ఈ ఆమ్లత కారణంగా, మీ లోదుస్తులపై రంగు మారడం సాధారణం.
నారింజ లేదా పసుపు రంగులో ఎందుకు మారుతుంది?
జననేంద్రియం సహజంగా ఆమ్లంగా ఉంటుంది. ఇది శరీరంలోని అనేక మార్పుల ఫలితంగా స్రావం విడుదల చేస్తుంది. మీ హార్మోన్ల మార్పులు, రుతుక్రమం, లైంగిక జీవితం వంటి అంశాలు కూడా ఈ pH స్థాయిని ప్రభావితం చేస్తాయి. జననేంద్రియంలో మంచి బ్యాక్టీరియా (లాక్టోబాసిల్లి) ఉంటుంది, ఇది ఆమ్లతని నియంత్రించి, చెడు బ్యాక్టీరియా పెరుగుదల నుంచి రక్షిస్తుంది. ఈ పరిస్థితి సాధారణమే.
మచ్చలు ఏర్పడటం ఆరోగ్యకరమా?
ఆరోగ్యకరమైన జననేంద్రియం ప్రతిరోజూ సుమారు 4 మిల్లీ లీటర్ల స్రావం ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణం. శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతుంది. అయితే, ఎక్కువ స్రావం ఉత్పత్తి అవుతున్నట్లు అనిపిస్తే, మీ వైద్యుని సంప్రదించడం ఉత్తమం.
ఈ సమస్య నుంచి ఎలా నివారించుకోవాలి?
మీ లోదుస్తులపై ఈ మచ్చలు కనిపించడం అనారోగ్యకరం కాదు. కానీ మీకు చెడు, మురికి ఉన్న లోదుస్తులు వేసుకోవడం నచ్చకపోతే, లేదా మీలో ఎదో అభద్రతా భావం ఉంటే కచ్చితంగా ఆ సమస్యను నివారించుకోవాలి. అందుకోసం తగిన చర్యలు చర్యలు తీసుకోవాలి. అవేంటంటే
లోదుస్తుల లైనర్స్ ఉపయోగించండి: ఈ లైనర్లు స్రావం లోదుస్తులను తాకకుండా నిలిపివేస్తాయి, తద్వారా మీరు మచ్చలను నివారించవచ్చు.
వెంటనే శుభ్రం చేయండి: స్రావం జరిగిన వెంటనే మీరు మీ లోదుస్తులను శుభ్రం చేసుకోండి. అవి ఆలస్యంగా ఉతికితే, ఆక్సీకరణ కారణంగా మచ్చలు ఏర్పడతాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు సులభంగా ఈ సమస్యను ఎదుర్కొంటూ, మీ లోదుస్తులను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications