Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
ఇలా చేస్తుంటే మెడ నొప్పి గ్యారెంటీ!.. ఈ విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడకుంటే నరకమే
ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా మెడ నొప్పికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా కనబతుతున్నాయి. మన చుట్టు పక్కల ఉండే చాలామంది మెడనొప్పితో బాధపడుతుండటం కొంతకాలంగా ఎక్కువగా చూస్తున్నాం. మెడను ఎక్కువగా వంచి పనిచేసేవాళ్లలో ఈ మెడనొప్పి ఎక్కువగా వస్తుంది. ఆఫీసుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్లు,డ్రైవర్లు తరుచుగా మెడనొప్పితో బాధపడుతుండటం గమనిస్తుంటాం. మెడ మీద ఎక్కువ భారం వేసినప్పుడు,అతిగా వ్యాయామం చేసినా,బరువులు ఎత్తే సమయంలో ఒత్తిడి వల్ల మెడ నొప్పి అనేది వస్తుంది.
గాయాలు,ప్రమాదాల కారణంగా కూడా మెడ నొప్పి వస్తుంది. మెడకు రక్తసరఫరా సరిగ్గా లేకపోయినా లేదా మెడలోని డిస్క్ లు కదిలినా కూడా మెడనొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెడ భాగం చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్కసారి మెడనొప్పి వస్తే డైలీ నరకం చూడాల్సిందేనని ఆ మెడనొప్పితే బాధపడేవాళ్లు చెప్తుంటారు. ఒక్కోసారి దాని తీవ్రత పెరిగితే పరిస్థితులు ప్రమాదకంగా మారతాయి. మెడనొప్పి తీవ్రంగా మారితే క్రమంగా అది ఇతర శరీర భాగాల సమస్యలకూ దారితీస్తుంది.

అయితే మెడ నొప్పి వస్తే కొద్దిసేపు మెడను దిండు కింద పెడితే చాలని..లేదంటే పట్టీ కొద్దిసేపు మెడకు పెట్టుకుంటే సరిపోతుందని మరికొందరు అనుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల నొప్పి కొంచెం మాత్రమే తగ్గుతుంది. మెడ నొప్పిని పూర్తిగా నివారించడానికి వేరే మార్గాలున్నాయి.
ఇలా చేస్తే మెడ నొప్పి రాదు
ప్రస్తుతం చేతిలో ఫోన్ లేకుంటే రోజు గడవని పరిస్థితి. అయితే ఫోన్లను అదేపనిగా ఉపయోగించకూడదు. ఫోన్ ని ఎక్కువగంటలు వాడటం వల్ల అదే పనిగా ఎక్కువసేపు మెడను వంచాల్సి వస్తుంది కాబట్టి ఫోన్ వాడకం బాగా తగ్గించండి. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు కంప్యూటర్ ల ముందు గంటల తరబడి కూర్చోకూడదు. ప్రతి 40 నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ దగ్గర నుంచి లేచి కొన్ని నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ని కళ్లకు సమానమైన ఎత్తులో ఉండేలా చూసుకోండి. అంటే వంగకుండా నిటారుగా కూర్చోవాలి.
శరీర భంగిమలను తరచూ మార్చాలి. ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం గానీ పడుకోవడం కానీ చేయకూడదు. అలాగే పడుకునేటప్పుడు మెత్తటి,తక్కువ ఎత్తు ఉన్న దిండులను మాత్రమే ఉపయోగించాలి. మెడపై ఒత్తిడి పడని వ్యాయామం చేయాలి. మెడ నొప్పి సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్లను కలిసి చూపించుకోవడం బెటర్. దీర్ఘకాలికంగా మెడ నొప్పి ఉంటే ఇతర ఆరోగ్య సమస్యలకు అది సంకేతం కూడా అయి ఉండవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications