Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
యువతల్లో గుండెపోటుకు ప్రధాన కారణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
యువకుల్లో గుండెపోటులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయ్. కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే గుండెపోటులు ఇప్పుడు చిన్నారుల్లో యువతల్లో కూడా రావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా తరువాత ఇలాంటి కేసులు చాలా పెరిగిపోయాయ్. ఇప్పుడు ఐదుగరు గుండె పేషంట్లలో ఒకరు 40 ఏళ్లలోపు ఉన్నవారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అధికారిక లెక్కల ప్రకారం 2000-2016వ సంవత్సరంలో 30 ఏళ్ల లోపు ఉన్నవారిలో గుండెపోటులు 2శాతం పెరిగాయ్.

యువతల్లో గుండెపోటుకు ప్రధాన కారణాలు
మధుమేహం ఉన్నవారికి గుండె సమస్య అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. రక్తకణాలను షుగర్ వ్యాధి దెబ్బతీస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నా, కొలస్ట్రాల్ స్థాయి అధికంగా ఉన్నా కూడా గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయ్.
గుండెపోటుకు అధికబరువు దగ్గరి సంబంధాలున్నాయ్. గుండెకు రక్తప్రసరణ చేసే రక్తనాళాలల్లో కొవ్వు పేరుకుపోయ్ రక్తప్రసరణ నిలిచిపోయే అవకాశం ఉంది. అధిక బరువు ఉంటే గుండె సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గదు.
గుండెపోటు సమస్యలకు హైపర్‌టెన్షన్ కూడా ఒక ప్రధాన కారణం. ఈ హైపర్‌టెన్షన్ కూడా పెద్దలకంటే యువతల్లోనే ఎక్కువగా ఉంటోంది. ఈ హైపర్ టెన్షన్‌కు కారణం అధిక రక్తపోటు. దీని వల్ల రక్తకణాలు దెబ్బతింటాయ్, గుండె సమస్యలు పెరుగుతాయ్.
సిగరెట్లు తాగడం కూడా గుండెపోటుకు ప్రధాన కారణం. ఎన్ని ఎక్కువ సిగరెట్లు తాగితే గుండెకు అంత ప్రమాదముంటుందని పరిశోధనల లెక్కలు కూడా చెబుతున్నాయ్. డ్రగ్స్ తీసుకోవడం కూడా గుండెపై ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. కొకైన్ హార్ట్‌బీట్ రేటును పెంచుతుంది.
లైఫ్‌స్టైల్ ఆహారం కూడా గుండెపోటుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయ్. బయటి చిరుతిళ్లు, జంక్‌ఫుడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. నూడుల్స్, కుకీస్, బర్గర్లు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వైటమిన్ డి కోసం అప్పుడప్పుడూ ఎండలో కొంత సమయం గడపండి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వారానికి కనీసం 5 సార్లు వ్యాయామం చేయాలి.
వైద్యుల దగ్గర ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవాలి. పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మీ బ్లడ్ ప్రెజర్‌ను ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోవాలి.
మద్యం, పొగ తాగడాన్ని ఆపివేయాలి. వత్తిడిని దూరం చేసుకోవాలి. మిమ్మల్ని ప్రేమించే వారితో ఎక్కువ సమయాన్ని గడపండి. సంవత్సరానికి ఓసారి గుండెసమస్యలు, మధుమేహానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications