Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
ఏడాదిలో 300 రోజులు మోదీ తినే ఫుడ్ ఇదే..దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఆగరు!..వారికి మాత్రం..
గత కొన్నాళ్లుగా మనదేశంలో 'మఖానా' వాడకం భారీగా పెరుగుతోంది. చాలా నగరాల్లో మఖానా(తామర గింజలు) ఇప్పుడు రోజువారీ బ్రేక్‌ఫాస్ట్‌గా మారిపోయింది. చిన్న పిల్లలకు కూడా అల్పాహారంగా మఖానా ఇస్తున్నారు. మఖానా ఒక సూపర్ ఫుడ్. ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఇది బెస్ట్ ఆప్షన్. అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను సూపర్ ఫుడ్స్ అంటారు. పోషకాల గనిగా పేర్కొంటున్న ఈ గింజల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం మాట్టాడారు.
గతవారం బీహార్ లోని భగల్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ..తాను కూడా ఏడాదిలో 300 రోజులు కచ్చితంగా తన డైట్ లో కూడా మఖానా ఉంచుతానని ప్రధాని మోదీ తెలిపారు. వీటిని పెద్ద ఎత్తున సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అసలు మఖానా తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో, మఖానా ఎవరు తినకూడదో ఇక్కడ చూడండి.

మఖానాకు డిమాండ్ ఎందుకు పెరగడం ప్రారంభమైంది?
భారతదేశం, విదేశాలలో కూడా మఖానాకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రజలకు ఇష్టమైనదిగా మారుతోంది. మఖానాకు పెరుగుతున్న డిమాండ్ వ్యాపారవేత్తలకు మఖానా వ్యాపారంలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని సృష్టించింది. ఓ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మఖానా సరఫరాలో 90 శాతం భారతదేశం నుండే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా మఖానాకు ఒక్కసారిగా డిమాండ్ ఎందుకు పెరిగిందనేది ప్రశ్న. మఖానాలో ఏయే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహారంలో ఇది ఎందుకు భాగం అవుతుందో తెలుసుకుందాం.
బరువు అదుపులో
మఖానాలో విటమిన్ ఏ, విటమిన్ బి5, నియాసిన్, విటమిన్ ఈ, విటమిన్ కె, బి-కాంప్లెక్స్ ఉన్నాయి. ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక పిడికెడు మఖానా తినడం వల్ల మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది..తరచుగా ఆకలి దప్పులు, జంక్ ఫుడ్ కోరికలను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మధుమేహం నియంత్రణలో ఉపయోగపడుతుంది
మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడేవారికి మఖానా అద్భుతమైన అల్పాహారం. మీరు మఖానా ప్లెయిన్ తినవచ్చు, కాల్చవచ్చు లేదా సలాడ్‌లో కలపవచ్చు. ఇది కాకుండా దీనిని జ్యూస్,షేక్ లలో కూడా కలపవచ్చు. మఖానాని పాలలో మరిగించి కూడా తినవచ్చు.
గుండె ఆరోగ్యానికి అద్భుతమైనది
మఖానాలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఎముకలు దృఢంగా తయారవుతాయి
మఖానాలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ ఉన్నాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మఖానాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముక నొప్పి, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది
మఖానాలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఫ్రీ రాడికల్స్ ముఖ చర్మం వృద్ధాప్యానికి కారణమవుతాయి. మఖానా తీసుకోవడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గుతాయి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ చర్మం మెరుస్తుంది, మీరు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
మఖానా ఎవరు తినకూడదు?
-మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే మఖానా తినడం మానుకోండి. ఎందుకంటే మఖానాలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, దాని వినియోగం శరీరంలో రాళ్ల పరిమాణాన్ని పెంచుతుంది.
-పెద్ద మొత్తంలో మఖానా తినడం వల్ల మీకు అలర్జీ సమస్యలు వస్తాయి. వీటిలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది.. మఖానా ఎక్కువగా తింటే శరీరంలో పిండి పదార్ధం మొత్తం పెరిగి అలెర్జీలకు కారణం కావచ్చు.
-మీకు డయేరియా ఉంటే మఖానా తినడం మానుకోండి. మఖానాలో తగినంత ఫైబర్ ఉంటుంది, ఇది తింటే ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
-అసిడిటీ సమస్య ఉన్నవారు మఖానా తినకూడదు. మఖానాలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.
- మఖానా తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి.
-గర్భిణీ స్త్రీలు మఖానా తినడం మానుకోవాలి.
-మీరు జలుబుతో బాధపడుతుంటే మఖానా వినియోగానికి దూరంగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications