Latest Updates
-
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.!
Hernia: ఈ సమస్య స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువ.. ఎందుకో తెలుసా?
హెర్నియా సమస్య చాలా మందిని వేధిస్తుంది. చుట్టుపక్కల కండరాలు, బంధన కణజాలాల్లో బలహీనమైన ప్రాంతం నుండి అవయవం లేదా కణజాలం బయటకు రావడాన్ని హెర్నియా అంటారు. ఈ సమస్య పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ కనిపిస్తుంది. అయితే స్త్రీలలో కంటే పురుషుల్లో ఈ సమస్య ఎక్కువ.
హెర్నియా పెద్ద వారిలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా, ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, ఊబకాయం, కండరాలపై విపరీతమైన ఒత్తిడి, కండరాల బలహీనత, మలబద్ధకం, దీర్ఘకాలంగా వేధించే దగ్గు లాంటి కారణాల వల్ల హెర్నియా రావొచ్చు.

శరీర నిర్మాణ సంబంధ తేడాలు:
పురుషులు, స్త్రీల శరీర నిర్మాణంలో వ్యత్యాసాల వల్ల పురుషుల్లో హెర్నియా ఎక్కువగా వస్తుంది. పురుషుల పొత్తి కడుపు వద్ద ఇంగువినల్ కెనాల్ అనే బలహీనమైన ప్రాంతం ఉంటుంది. ఇది మగవారిలో స్పెర్మాటిక్ కార్డ్‌కు ఒక మార్గం. ఈ బలహీనమైన ప్రదేశం హెర్నియేషన్ కు గురవుతుంది. పురుషుల్లో ఇంగువినల్ హెర్నియాలు అత్యంత సాధారణ రకం.
స్త్రీలలో కటి ప్రాంతం వెడల్పుగా ఉంటుంది. ఇది ఉదర గోడకు మెరుగైన మద్దతును, స్థిరత్వాన్ని అందిస్తుంది. అలా హెర్నియేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పొత్తికడుపుపై ఒత్తిడి పెరగడం:
పురుషుల్లో, స్త్రీలలో పొత్తికడుపుపై పడే ఒత్తిడిలో వ్యత్యాసం ఉంటుంది. బరువులు ఎత్తడం, తీవ్రమైన శారీరక శ్రమ లాంటి వాటి వల్ల పురుషుల పొత్తికడుపుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి ఉదర గోడల బలహీనమైన ప్రాంతాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది హెర్నియా ఏర్పడేందుకు దారి తీస్తుంది.
జెనెటిక్ ప్రీడిస్పోసిషన్:
హెర్నియాలు ఏర్పడటంలో జన్యు సంబంధిత కారణాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని జన్యుపరమైన కారకాలు బలహీనమైన బంధన కణజాలానికి, కండరాలకు దారితీస్తాయి. వాటి ద్వారా హెర్నియేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ జెనెటిక్ ప్రీడిస్పోసిషన్ పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
హార్మోన్ల ప్రభావం:
హార్మోన్లు హెర్నియాల అభివృద్ధిపై కూడా ప్రభావం చూపుతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ బంధన కణజాలాన్ని బలహీన పడటంతో సంబంధం ఉంటుంది. ఇది పురుషుల్లో హెర్నియాలకు గురిచేసే అవకాశం ఉంది.
మహిళల్లో ఎక్కువగా విడుదలయ్యే ఈస్ట్రోజెన్ బంధన కణజాలాన్ని రక్షిస్తుంది. ఈ హార్మోన్ల వ్యత్యాసం పురుషుల్లో హెర్నియాకు కారణమైతే, మహిళల్లో మాత్రం హెర్నియా రాకుండా అడ్డుకుంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications