Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పెళ్లికి ముందు వధూవరులకు పసుపు ఎందుకు పూస్తారు? హల్దీ పంక్షన్ వెనుక ఇంత రహస్యముందా
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడా చూసినా పెళ్లిళ్ల హడావుడి కనిపిస్తోంది. కళ్యాణ మంటపాలన్నీ ఫుల్ అయిపోతున్నాయి. అయితే పెళ్లిళ్ల సమయంలో ఓ ఆచారం అందరూ పాటిస్తారు కానీ చాలామందికి దాని గురించి తెలియదు. అదే హల్దీ వేడుక. తాళిబొట్టు కట్టడానికి ఒకటి రెండు రోజుల ముందు హల్దీ ఫంక్షన్ చేస్తారు. ఈ సమయంలో వధూవరులకు పసుపు పూస్తారు.
అయితే పాత రోజుల్లో వధూవరులకు పసుపు పూసే ఆచారం పెళ్లికి 10-15 రోజుల ముందే ప్రారంభమయ్యేది. వధూవరులకు పెళ్లికి ముందు పసుపు రాసే సాంప్రదాయం ఆచారాలకే పరిమితమైనది కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ, సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపును పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు
పసుపును వివాహ సందర్భాలలో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడమే కాకుండా దానిని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. పసుపు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి, దానిని శుభ్రపరుస్తుంది, స్కిన్ మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా, దాని రిలాక్సింగ్ లక్షణాలు శరీరాన్ని రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఇది వివాహ సమయంలో ఏర్పడే ఒత్తిడి, భయాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ పసుపు ఆచారం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు మనస్సు, శరీరం రెండింటికీ విశ్రాంతిని, శక్తినిచ్చే సహజ నివారణ.
మతపరమైన నమ్మకం
హిందూ మతంలో వివాహం పవిత్రమైన బంధంగా పరిగణించబడుతుంది. విష్ణు దేవుడు వైవాహిక జీవితానికి రక్షకుడిగా భావిస్తారు. పసుపు అనేది విష్ణువుకు ఇష్టమైన రంగు. ఇది స్వచ్ఛత, శ్రేయస్సు, శుభాలను సూచిస్తుంది. ఇది శుద్ధి, శుభం, ఆరోగ్యానికి ప్రతీక. అందుకే వివాహ వేడుకల్లో పసుపు, పసుపు రంగులకు ప్రత్యేక స్థానం కల్పించారు. హల్దీ సమయంలో వధూవరులు పసుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఇది ఈ శుభ సందర్భం యొక్క పవిత్రతను, ఆనందాన్ని మరింత పెంచుతుంది.
చర్మ సంరక్షణ
చర్మ సంరక్షణలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ పెళ్లిళ్లలో పసుపుకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. పసుపు..చర్మ సమస్యలకు సహజ పరిష్కారం. పూర్వకాలంలో బ్యూటీ పార్లర్, స్కిన్ కేర్ ట్రెండ్ లేదు కాబట్టి వధువు కోసం పసుపుతో ప్రత్యేకంగా లేపనం తయారు చేయబడి ఉండేది. పెళ్లికి చాలా రోజుల ముందు నుంచే వధువుకు పసుపు రాస్తుండం చేసేవాళ్లు. పెళ్లి రోజున వధువు అందంగా తలతల మెరిసేలా కనిపించేలా తల నుండి కాలి వరకు పసుపు రాస్తారు.
పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మచ్చలు, దురదలు, ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇది బాహ్య సౌందర్యాన్ని పెంపొందించడమే కాకుండా చర్మం అంతర్గత ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications