Latest Updates
-
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే!
మగవాళ్లు గుమ్మడి గింజలు ఎందుకు తినాలో తెలుసా?
కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా వ్యవహరించేవాళ్లు కూడా కరోనా తర్వాత నుంచి ఆరోగ్యమే ఫస్ట్ అన్నట్లుగా మారిపోయారు. ఆరోగ్యంగా ఉంటే చాలు అది కోటిరూపాయలు అన్నట్లుగా మారిపోయారు. ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే ప్రతి ఒక్కరి వంటింట్లో అవిసె గింజలు, చియా విత్తనాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న మరొక అద్భుతమైన ఆహారం గుమ్మడికాయ గింజలు.
సాధారణంగా గుమ్మడి గింజలు అనగానే చాలామంది ఇవి స్త్రీలకు సంబంధించిన ఆహారమని భావిస్తుంటారు. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి ఇవి ఉపయోగపడతాయని మనకు తెలుసు. నిపుణుల ప్రకారం గుమ్మడి గింజలు కేవలం స్త్రీలకే కాదు, పురుషుల ఆరోగ్యానికి కూడా ఒక సంజీవని లాంటివి. పురుషులు రోజూ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి.

పునరుత్పత్తి వ్యవస్థ, స్పెర్మ్ క్వాలిటీకి రక్షణ
చాలా మంది మగవాళ్లు ప్రస్తుతం పునరుత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారికి గుమ్మడి గింజలు ఒక వరం. ఈ గింజల్లో జింక్ అధిక మొత్తంలో ఉంటుంది. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత టెస్టోస్టెరాన్ లెవల్స్ ఉండటం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇవి కేవలం హార్మోన్లనే కాకుండా, స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీని కాపాడటంలో కూడా సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వీర్యకణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే మెగ్నీషియం, అర్జినిన్ వంటి పోషకాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి, సంపూర్ణ పునరుత్పత్తి ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి.
గుండెకు రక్షణ
ఇటీవల కాలంలో ముఖ్యంగా గత 4-5 ఏళ్లల్లో గుండె సంబంధిత సమస్యలు పెరగడం,మరణాలు కూడా నమోదవడం చూస్తున్నాం. పంక్షన్స్ లో డ్యాన్స్ చేస్తూ, రోడ్డుపై నడుస్తూనే, తింటూనే ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్న ఘటన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మగవాళ్లు ఎక్కవగా ఇలా మరణిస్తుండటం గమనించవచ్చు.
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు,శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.
ప్రోస్టేట్ ఆరోగ్యానికి భరోసా
వయసు పెరిగే కొద్దీ పురుషులను వేధించే ప్రధాన సమస్యలలో ప్రోస్టేట్ గ్రంథి వాపు లేదా క్యాన్సర్ ఒకటి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్, ఫైటోస్టెరాల్స్.. ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
తరచుగా మూత్ర విసర్జన సమస్యలు లేదా మూత్రాశయ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారికి ఈ గింజలు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ పరిమాణం కంట్రోల్ లో ఉంటుంది.
వీటిని ఎలా తీసుకోవాలి?
గుమ్మడి గింజలను పచ్చిగా లేదా దోరగా వేయించి తినవచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్ గా లేదా ఉదయం స్మూతీలు, సలాడ్లు, ఓట్స్ మీద చల్లుకుని తినడం ద్వారా వీటి పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











