Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
Cough In Summer: వేసవిలో పొడిదగ్గు వేధిస్తోందా? ఎంతకీ తగ్గడం లేదా? అయితే ఇలా చేయండి
చలికాలం వచ్చిందంటే చాలా మంది జలుబుతో, దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. అయితే కొంత మంది వేసవికాలంలోనూ పొడిదగ్గుతో చాలా ఇబ్బంది పడతారు. నిరంతరం దగ్గు వేధిస్తుంటుంది. ఎండాకాలంలో పొడి దగ్గు వేధించడానికి కారణాలేమిటి, దాని నుండి ఉపశమనం పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి పొడిదగ్గు:
సాధారణంగా చలికాలంలో జలుబు, ఫ్లూ వల్ల దగ్గు వస్తుంటుంది. కొంత మందిలో వేసవిలో పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంది. గొంతు వెనక భాగంలో ఒక రకమైన చికాకు వల్ల పొడి దగ్గు వస్తుంది. ఈ చికాకుకు చాలా కారణాలే ఉండొచ్చు. చికాకు ఎక్కువ రోజులు ఉంటే దగ్గు కూడా ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతుంది.
వేసవిలో పొడిదగ్గుకు కారణాలు
హేఫీవర్:
వేసవిలో పొడి దగ్గుకు హేఫీవర్ కారణం కావొచ్చు. గాలిలో దుమ్ము, ధూళి, పూల పుప్పొడి, ఇతర కారకాల వల్ల గొంతులో చికాకు మొదలవుతుంది. ఈ చికాకు వల్ల దగ్గు వస్తుంది. గొంతు వెనక భాగంలో పొడిబారడం వల్ల చికాకు వచ్చి దాని వల్ల దగ్గు రావొచ్చు.
పొడిగాలి:
వేసవిలో గాలి పొడిగా ఉంటుంది. తేమ ఉండదు. ఈ పొడిగాలిని పీల్చుకోవడం వల్ల ముక్కు, గొంతులోని వాయు మార్గాలు చికాకుకు గురవుతాయి. ఈ చికాకు దగ్గుకు దారితీస్తుంది.
వాయుకాలుష్యం:
ఎండాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. తేమ లేని పొడి గాలి వల్ల కాలుష్య కారకాలు ఒక చోటు నుండి చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. ఈ కారకాలు వల్ల శ్వాస నాళాలు చికాకు వచ్చి దగ్గు రావొచ్చు.

వేసవి దగ్గుకు నివారణ చిట్కాలు
హైడ్రేటెడ్ గా ఉండాలి:
పొడిగాలి వల్ల వచ్చే దగ్గును తగ్గించడానికి ఉత్తమమైన మార్గాల్లో ఒకటి హైడ్రేటెడ్ గా ఉండటం. రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. ఎండాకాలంలో చెమట రూపంలో ఎక్కువ నీరు పోతుంది కాబట్టి దానిని భర్తీ చేసేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి.
వీటిని నివారించాలి:
పుప్పొడి, కాలుష్య కారకాలు గొంతు అలెర్జీకి కారణం అవుతాయి. వీలైనంత వరకు వాటిని నివారించడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఎయిర్ ఫిల్టర్ వంటివి ఉపయోగిస్తే బయటి కాలుష్యాన్ని వడపోసి స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే వీలు ఉంటుంది.
గోరువెచ్చని నీరు తాగాలి:
ఎండాకాలంలో చల్లని నీరు తాగాలని అనిపిస్తుంది. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నప్పుడు చల్లని నీటి వల్ల ఉపశమనంగా అనిపిస్తుంది. అయితే చల్లని నీటి వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అందుకే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతులో చికాకును దూరం చేసుకోవచ్చు.
వేసవిలో దగ్గు చాలా విసుగ్గా ఉంటుంది. ఈ దగ్గును తగ్గించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. హైడ్రేటెడ్ గా ఉండటం, ట్రిగ్గర్ లను నివారించడం దగ్గును అణిచివేసే మందును ఉపయోగించడం, అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవడం ద్వారా, దగ్గును అదుపులో ఉంచుకోవచ్చు.
దగ్గు ఎక్కువ కాలం ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యుని వద్దకు వెళ్లాలని గుర్తుంచుకోండి. గొంతులో వచ్చిన ఇన్ఫెక్షన్ ను గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే దగ్గు నుండి బయటపడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications