Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Uric Acid: మహిళల్లో యూరిక్ యాసిడ్ పెరుగడానికి ప్రధాన కారణాలివే
యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. మనం తినే ఆహారంలో ఉండే ప్యూరిన్ లు అనే రసాయనాలు జీర్ణం అయినప్పుడు అవి విచ్ఛిన్నమై యూరిక్ యాసిడ్ గా మారతాయి. సాధారణంగా శరీరంలో ఏర్పడిన యూరిక్ యాసిడ్ రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఇది శరీరంలో ఒక సాధారణ జీవక్రియలో భాగం. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అది కీళ్లలో పేరుకుపోయి గౌట్ వంటి సమస్యలకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో యూరిక్ యాసిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
మహిళల శరీరంలోని ప్రత్యేకమైన హార్మోన్ల మార్పులు, జీవనశైలి అలవాట్లు దీనికి ప్రధాన కారణమవుతున్నాయి. ఒకప్పుడు అరుదుగా వినిపించిన ఈ సమస్య ఇప్పుడు మహిళల్లో సర్వసాధారణంగా మారుతోంది. మరి మహిళల్లో యూరిక్ యాసిడ్ వేగంగా పెరగడానికి గల కొన్ని ప్రధాన కారణాలను తెలుసుకుందాం

పీరియడ్స్, హార్మోన్ల ప్రభావం
మహిళల ఆరోగ్యానికి ఈస్ట్రోజెన్ హార్మోన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, పీరియడ్స్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తాత్కాలికంగా పెరగవచ్చు. ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ రక్షణ కవచం తొలగిపోవడంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు వేగంగా పెరిగి కీళ్ల నొప్పులకు దారితీస్తాయి.
జీర్ణక్రియ లోపాలు
మన శరీర జీవక్రియ సక్రమంగా ఉన్నంతవరకే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్ లను శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోలేనప్పుడు యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. థైరాయిడ్ సమస్యలు, మధుమేహం లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇతర సమస్యలు ఉన్నప్పుడు జీవక్రియ మందగిస్తుంది. ఇది నేరుగా యూరిక్ యాసిడ్ పెరుగుదలకు కారణమవుతుంది.
ఉపవాసాల ప్రభావం
మహిళలు తరచుగా ఉపవాసాలు ఉండటం లేదా పూజలు చేయడం వంటివి చేస్తుంటారు. ఇది జీవక్రియపై ప్రభావం చూపుతుంది, జీర్ణ ఎంజైమ్‌లకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. ప్రోటీన్ ను జీర్ణం చేయడానికి అవసరమైన జీర్ణ ఎంజైమ్‌లు తగ్గినప్పుడు యూరిక్ యాసిడ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కాబట్టి కీళ్ల నొప్పులు, వాపులు, వేళ్లలో మంట వంటి లక్షణాలను తేలికగా తీసుకోకూడదు. మహిళల శరీర తత్వానికి అనుగుణంగా యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక ప్రత్యేక కారణాలు ఉంటాయి.ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని, స్త్రీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా మెడికల్ టెస్ట్ లు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్యలను నియంత్రించవచ్చు. మీ శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు గమనిస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications