Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
చెమటతో బాగా ఇబ్బందిపడుతున్నారా?..జస్ట్ ఇలా చేస్తే చెమట,దుర్వాసన ఉండవ్!
ఎండాకాలంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య చెమట. కొందరికి అయితే సమ్మర్ లో ప్రతిరోజూ ఒళ్లంతా చెమటనే ఉంటుంది. నడుస్తున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు చెమటలు పడుతుంటాయి. ముఖ్యంగా చంకలు, అరచేతులు, అరికాళ్లలో చెమట ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి షర్ట్, టాప్, బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంకల్లో కనిపించే చెమట వల్ల చిరాకు పడే సందర్భాలూ ఉంటాయి. కొందరికి వేడితో పాటు చెమట గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల కూడా ఎక్కువ చెమట పడుతుంది. దీన్నే హైపర్‌హైడ్రోసిస్ సిండ్రోమ్ అంటారు.
అధిక చెమట వల్ల శరీరంలో అసౌకర్యంగా ఉండటమే కాకుండా, దుర్వాసన కూడా వస్తుంది. ఇది వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఓ అంచనా ప్రకారం మన శరీరంలో 3 నుంచి 4 మిలియన్ల చెమట గ్రంథులు ఉంటాయి. వీటిలో చాలా వరకు ఎక్రైన్ గ్రంథులు. ఇవి ఎక్కువగా అరికాళ్లు, అరచేతులు, నుదురు, బుగ్గలు, చంకల్లో ఉంటాయి. ఎక్రైన్ గ్రంథులు శుభ్రమైన, వాసన లేని ద్రవాన్ని విడుదల చేస్తాయి. ఇది శరీరాన్ని ఆవిరి ప్రక్రియ ద్వారా చల్లబరచడానికి సహాయపడుతుంది. మరో రకమైన చెమట గ్రంథులను అపోక్రైన్ అంటారు. ఇవి చంకలు, జననాంగాల చుట్టూ ఉంటాయి. ఈ గ్రంథులు చిక్కటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ద్రవం చర్మం ఉపరితలంపై ఉండే బ్యాక్టీరియాతో కలిసినప్పుడు దుర్వాసన వస్తుంది.

చెమట,దాని దుర్వాసనకు ఇలా చెక్
శుభ్రతకు ప్రాధాన్యత
చెమట.. వాసనకు అసలు కారణం కాదు. చెమట బ్యాక్టీరియాతో కలిసినప్పుడే దుర్వాసన వస్తుంది. అందుకే స్నానం చేసిన వెంటనే చెమట వచ్చినా దుర్వాసన రాదు. పదే పదే చెమట వచ్చి ఆరిపోతుంటేనే దుర్వాసన మొదలవుతుంది. చెమట వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు చర్మాన్ని పొడిగా,శుభ్రంగా ఉంచుకుంటే చెమట దుర్వాసన సమస్యను చాలా వరకు నివారించవచ్చు.
ఇవి ఉపయోగించండి
డియోడ్రెంట్ చెమట రాకుండా ఆపలేకపోయినప్పటికీ శరీరం నుంచి వచ్చే దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుంది. బలమైన యాంటీపెర్స్పిరెంట్ చెమట రంధ్రాలను మూసివేయగలదు. దీనివల్ల చెమట తక్కువగా వస్తుంది. చెమట రంధ్రాలు మూసుకుపోయాయని మీ శరీరం గ్రహించినప్పుడు అవి లోపల నుండి చెమటను విడుదల చేయడం ఆపివేస్తాయి. ఈ యాంటీపెర్స్పిరెంట్లు గరిష్టంగా 24 గంటల వరకు ప్రభావవంతంగా ఉంటాయి. వీటిని ఉపయోగించేటప్పుడు సూచనలను పాటించకపోతే చర్మంపై చికాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా యాంటీపెర్స్పిరెంట్ ఉపయోగించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
లాంటోఫోరేసిస్
ఈ పద్ధతి సాధారణంగా తేలికపాటి యాంటీపెర్స్పిరెంట్లు ఉపయోగించినా ఫలితం లేనివారికి ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్‌లో అయాంటోఫోరెసిస్ అనే వైద్య పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా నీటితో నిండిన టబ్ లేదా ట్యూబ్‌లోకి తేలికపాటి విద్యుత్ ప్రవాహాన్ని పంపుతారు. తర్వాత బాధిత వ్యక్తిని అందులో చేతులు పెట్టమని చెబుతారు. ఈ విద్యుత్ చర్మం ఉపరితలం ద్వారా కూడా ప్రవేశిస్తుంది. ఇది చేతులు, కాళ్లలో చెమట పట్టే సమస్యను బాగా తగ్గిస్తుంది. కానీ చంకల్లో వచ్చే అధిక చెమట సమస్యను పరిష్కరించడానికి ఈ పద్ధతి సరికాదు.
మెసోబొటాక్స్
చంకల్లో ఎక్కువగా చెమట పట్టడం దుర్వాసనకు మాత్రమే కాకుండా మీ దుస్తులను కూడా పాడు చేస్తుంది. దీని ట్రీట్మెంట్ కోసం చంకల్లో స్వచ్ఛమైన బోటులినమ్ టాక్సిన్ తక్కువ మోతాదును ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. ఇది చెమట నరాలను తాత్కాలికంగా మూసివేస్తుంది. దీని ప్రభావం 4 నుంచి 6 నెలల వరకు ఉంటుంది. నుదురు, ముఖంపై ఎక్కువగా చెమట పట్టే సమస్యకు మెసోబొటాక్స్ ఒక అద్భుతమైన పరిష్కారం. దీంట్లో పలుచన చేసిన బొటాక్స్‌ను ఇంజెక్షన్ ద్వారా చర్మంలోకి ఎక్కిస్తారు.
ఇవి తినకూడదు
కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా ఎక్కువ చెమట పట్టవచ్చు. నల్ల మిరియాలు వంటి వేడి మసాలాలు ఎక్కువ చెమటను కలిగిస్తాయి. అదేవిధంగా ఆల్కహాల్, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చెమట రంధ్రాలు ఎక్కువగా తెరుచుకోవచ్చు. దీంతో పాటు ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చెమట దుర్వాసన పెరుగుతుంది. కాబట్టి వేసవిలో ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications