Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా?
ప్రస్తుతం చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అందులో కూడా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే కిడ్నీలో రాళ్లు ఉంటే అవి కరిగిపోవాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది? నీరు త్రాగడం వల్ల నిజంగానే మూత్రపిండాల్లో రాళ్ళు నిజంగా తొలగిపోతాయా? అయితే ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చూద్దాం.
నీరు త్రాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు తొలగిపోతాయా?
మూత్రపిండాల ప్రక్రియ సక్రమంగా పనిచేయడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది మలాన్ని పలుచన చేయడమే కాకుండా ఎటువంటి చికాకు లేకుండా సులభంగా బయటకు రావడానికి కూడా సహాయపడుతుంది. నీరు త్రాగడం ద్వారా ఖనిజాలు, లవణాలు మూత్రపిండాల లోపల రాళ్ల రూపంలో పేరుకుపోవు. నీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి
ఎవరికైనా చిన్న కిడ్నీ రాయి అంటే 5 మిమీ కంటే తక్కువ రాయి కిడ్నీలో ఉంటే కొన్ని సందర్భాల్లో అది మూత్ర నాళం నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ నీరు త్రాగడం అంటే రోజుకు కనీసం 2.5-3 లీటర్లు లేదా 8 నుండి 12 గ్లాసుల నీళ్లు తాగితే ప్రేగు కదలికల ఫ్రీక్వెన్సీని పెంచుతుంది, ఇది చిన్న రాళ్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అదే సమయంలో శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే రాళ్ళు క్రమంగా చిన్నవి అవుతాయి.
అయితే కిడ్నీలో రాయి మధ్యస్థం నుండి పెద్దది అంటే 5 మిమీ లేదా అంతకంటే పెద్దదిగా ఉంటే నీరు త్రాగటం వల్ల మాత్రమే అది కరిగిపోదు. పెద్ద రాళ్లకు..మందులు, షాక్ వేవ్ లిథోట్రిప్సీ లేదా ఆపరేషన్ అవసరం కావచ్చు. కిడ్నీలో రాళ్లు అనేది పెద్ద సమస్య కాబట్టి దీని గురించి తెలిస్తే ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించి తగిన చర్యలు చేపట్టడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
