Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మొండి చుండ్రు వదలట్లేదా? ఇలా చేసి చూడండి..ఫలితం పక్కా!
చలికాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మనల్ని పలకరిస్తాయి. అందులో ముఖ్యమైనది, అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేది జుట్టు సమస్య. ముఖ్యంగా శీతాకాలంలో చుండ్రు బెడద తీవ్రమవుతుంది. తలలో దురద పుట్టడం, నలుగురిలో ఉన్నప్పుడు భుజాల మీద తెల్లటి పొరలు రాలడం వంటివి చాలా అసౌకర్యానికి, ఇబ్బందికి గురిచేస్తాయి.
ఈ సమస్యను వదిలించుకోవడానికి చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన రసాయన షాంపూలను వాడుతుంటారు. ఇవి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. జుట్టును సహజంగా, అందంగా, చుండ్రు రహితంగా మార్చుకోవాలంటే మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలే బెటర్. అవేంటో, వాటిని ఎలా వాడాలో ఇక్కడ చూడండి.

కొబ్బరి నూనె - కర్పూరం
చలికాలంలో చుండ్రు రావడానికి ప్రధాన కారణం తల పొడిబారిపోవడం. చర్మం పొడిగా మారినప్పుడు మృతకణాలు పొరలుగా రాలుతాయి. దీనికి కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
ఎలా వాడాలి
కొంచెం స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో, హారతి కర్పూరాన్ని పొడి చేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా లేదా నూనెలా తయారు చేసుకుని జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
ప్రయోజనం
కొబ్బరి నూనె జుట్టుకు తేమను అందిస్తే, కర్పూరం తన యాంటీ బాక్టీరియల్ గుణాలతో చుండ్రును, దురదను తగ్గిస్తుంది. ఇది తలకు చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
మెంతి మ్యాజిక్
జుట్టు సంరక్షణలో మెంతులకు అనాదిగా ప్రత్యేక స్థానం ఉంది. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, చుండ్రును సమూలంగా నివారిస్తాయి.
ఎలా వాడాలి
కొన్ని మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి కొంచెం పెరుగు, ఒక టీస్పూన్ త్రిఫల పొడిని కలపాలి. ఈ ప్యాక్ ను తలకు పట్టించి, ఒక గంట పాటు ఆరనివ్వాలి.తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
ప్రయోజనం
ఇలా చేయడం వల్ల తలలోని ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గి, జుట్టు పట్టుకుచ్చులుగా మారుతుంది. చుండ్రు సమస్య నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
నిమ్మరసంతో నిగనిగలు
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రును తరిమికొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే నిమ్మరసాన్ని నేరుగా తలకు పట్టించకూడదు.
ఎలా వాడాలి
ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని, దానికి స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు బాగా పట్టించి, వేళ్ళతో మృదువుగా మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
ప్రయోజనం
ఇది తలలోని pH లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంతో పాటు, అధిక జిడ్డును తొలగించి చుండ్రును మాయం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications