Latest Updates
-
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త!
జుట్టు విపరీతంగా రాలిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
చలికాలంలో జుట్టు రాలడం చాలామందికి పెద్ద సమస్యగా ఉంటుంది. చల్లని గాలులు, తలపై పేరుకుపోయే చుండ్రు.. జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే శీతాకాలంలో జుట్టు రాలడానికి వాతావరణం మాత్రమే కారణం కాదండొయ్.
తలస్నానం తర్వాత మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణమని మీకు తెలుసా? ఈ చలికాలంలో మీ జుట్టును పదిలంగా కాపాడుకోవాలంటే స్నానం తర్వాత 5 తప్పులను అస్సలు చేయకండి.

టవల్ తో జుట్టును గట్టిగా రుద్దకండి
చాలామంది తలస్నానం చేసిన వెంటనే జుట్టులోని నీటిని తొలగించడానికి టవల్ తో గట్టిగా రుద్దుతుంటారు. ఇది జుట్టుకు చేసే అతిపెద్ద హాని. తడిగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లు చాలా బలహీనంగా ఉంటాయి. ఆ సమయంలో గరుకుగా ఉండే టవల్ తో రుద్దడం వల్ల జుట్టు చిట్లిపోవడమే కాకుండా, కుదుళ్ల నుంచి ఊడిపోతుంది.
సాధారణ టవల్స్ కు బదులుగా పాత మెత్తటి కాటన్ టీ-షర్ట్ లేదా మైక్రోఫైబర్ క్లాత్ ని ఉపయోగించండి. జుట్టును రుద్దకుండా, మృదువుగా అద్దుతూ నీటిని పీల్చుకునేలా చేయండి.
తడి జుట్టును దువ్వడం మానుకోండి
సమయం లేదనో, చిక్కులు పడతాయన్న భయంతోనో చాలామంది తడి జుట్టుపైనే దువ్వెన పెడుతుంటారు. తడిగా ఉన్న జుట్టు సాగే గుణాన్ని కలిగి ఉండి, త్వరగా తెగిపోతుంది.
తడి జుట్టును దువ్వడం వల్ల మామూలు కంటే రెట్టింపు జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వండి. చిక్కులు తీయడానికి వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను మాత్రమే వాడండి.
కండిషనర్, సీరం తప్పనిసరి
చలికాలంలో గాలిలో తేమ తక్కువగా ఉండటం వల్ల జుట్టు పొడిబారిపోతుంది. కేవలం షాంపూతో స్నానం చేసి వదిలేస్తే జుట్టు గరుకుగా మారి చిక్కులు పడుతుంది. ఇది దువ్వినప్పుడు జుట్టు తెగిపోవడానికి దారితీస్తుంది.
షాంపూ చేసిన ప్రతిసారీ తప్పనిసరిగా కండిషనర్ వాడండి. తల ఆరబెట్టుకున్న తర్వాత మంచి హెయిర్ సీరం అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది, చిక్కులు పడకుండా కాపాడుకోవచ్చు.
తడి జుట్టును ముడి వేయకండి
పనిలో పడి చాలామంది తడిగా ఉన్న జుట్టును పైకి కట్టి ముడి వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కుదుళ్లపై ఒత్తిడి పెరిగి జుట్టు బలహీనపడుతుంది. అంతేకాకుండా లోపల ఉన్న తేమ ఆరకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చుండ్రు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జుట్టును సహజ గాలికి ఆరనివ్వండి. పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే క్లిప్స్ లేదా రబ్బర్ బ్యాండ్స్ వాడండి.
దిండు కవర్ల విషయంలో జాగ్రత్త
మీరు వాడే దిండు కూడా మీ జుట్టు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాటన్ దిండు కవర్లు జుట్టులోని తేమను పీల్చేసుకుని, ఘర్షణను కలిగిస్తాయి. దీనివల్ల జుట్టు చిట్లిపోతుంది.
మీ జుట్టు మృదువుగా ఉండాలంటే సిల్క్ లేదా శాటిన్ పిల్లోకేస్ లను వాడండి. ఇవి జుట్టు రాపిడికి గురికాకుండా కాపాడతాయి. అలాగే క్రమం తప్పకుండా దిండు కవర్లను మారుస్తూ ఉండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications