Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బెల్లం,పచ్చి పసుపుతో శరీరంలో కొత్త శక్తి..ఈ విషయం తెలిస్తే అస్సలు ఆగరు
మిగతా సీజన్ లతో పోలిస్తే చలికాలంలో ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశముంటది కాబట్టి ఈ సీజన్ లో ఆరోగ్యం గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సీజన్ లో వచ్చే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. శీతాకాలంలో సూపర్ ఫుడ్ గా పరిగణించేవాటిలో పచ్చి పసుపు, బెల్లం కూడా ఉంటాయి. ఉదయాన్నే పచ్చి పసుపు, బెల్లం తింటే మన శరీరానికి బోలెడు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రెండు కలిపి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు లోపలి నుంచి పోషణను అందిస్తాయి.
ఎలా తినాలి
పచ్చి పసుపు, బెల్లం ఆహారంలో చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పచ్చి పసుపు,బెల్లం రెండింటిని కలిపి టీ తయారు చేసుకోవచ్చు, పెరుగుతో తినవచ్చు. ఈ రెండింటిని నీళ్లలో వేసి మరిగించి కూడా తాగవచ్చు.

తినడం వల్ల వచ్చే ప్రయోజనాలివే
రక్తం శుద్ధి
రక్తాన్ని శుద్ధి చేయడంలో బెల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పచ్చి పసుపు రక్తం సన్నబడటానికి కూడా సహాయపడుతుంది..ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థబలోపేతం
పచ్చి పసుపులో ఉండే కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ మొదలైన వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి,ఇది శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడుతుంది.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యం
పచ్చి పసుపు, బెల్లం రెండూ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. పచ్చి పసుపు జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
వాపు తగ్గుదల
పచ్చి పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
ఎనర్జీ లెవల్స్ పెరుగుదల
సహజమైన చక్కెర బెల్లంలో లభిస్తుంది, ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. చలికాలంలో అలసటగాబ,బలహీనంగా అనిపించినప్పుడు బెల్లం తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది,పచ్చి పసుపుతో కలిపి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications