Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Winter tips: చలికాలంలో జాగ్రత్త.. బాత్రూమ్ లో అలా చేస్తే గుండెపోటు గ్యారెంటీ!
ప్రస్తుతం చలి చంపేస్తోంది. చల్లటి గాలులు వీస్తుండటంతో స్వెట్టర్స్ లేకుండా బయటకి వెళ్లల్లేని పరిస్థితి ఉంటది. మన దగ్గరే కాదు దేశంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే చలికాలంలో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చాలా సందర్భాలలో స్నానం చేస్తున్నప్పుడు గుండెల్లో నొప్పి రావడం, లేదా బాత్రూమ్ లో గుండెపోటుతో మరణించారు అని వింటుంటాం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ఇలా చనిపోయినవాళ్లు ఉన్నారు. చలికాలంలో స్నానం చేసే సమయంలో మనకు గుండెపోట వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి ఒక ప్రధాన కారణం చలికాలంలో సరిగ్గా స్నానం చేయకపోవడమేనంట. అవును ఇది నిజమే, అసలు స్నానంకి గుండెపోటుకి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా?
చలికాలంలో బాత్రూమ్ లో స్నానం చేసే సమయంలో చాలా మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి చలికాలంలో ప్రతి ఓక్కరూ దీనిపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే స్నానం చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.

స్నానం చేసేటప్పుడు ఈ విషయంపై శ్రద్ధ వహించండి
చల్లని వాతావరణంలో సరైన స్నానం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ముందుగా పాదాలను కడుక్కోండి తర్వాత నడుము కింది భాగంలో నీళ్లు పోయండి. ఇలా స్నానం చేయడం వల్ల గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. మీరు చల్లని వాతావరణంలో మీ శరీరంపై అకస్మాత్తుగా నీటిని పోస్తే అది మీ ఆరోగ్యానికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి సరిగ్గా స్నానం చేయడం చాలా ముఖ్యం.
స్నానానికి ముందు శరీరానికి మసాజ్ చేయండి
చల్లటి వాతావరణంలో స్నానానికి ముందు ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె ఉపయోగించండి. ఈ నూనెలతో మసాజ్ చేయడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఇలా చేయడం వల్ల జలుబును కూడా నివారించవచ్చు. మసాజ్ చేసిన తర్వాత తలస్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుందని తద్వారా గుండెపోటు ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications