Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఇలా చేయండి.. ఇంకెప్పటికీ చర్మం పగలదు!
దాదాపు చలికాలం మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడం మొదలైపోయింది. ఇలాంటి సందర్భాల్లో చర్మానికి సంబంధించిన జాగ్రత్తలపై ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఉరుకుల పరుగుల జీవితంలో చర్మ జాగ్రత్తలు పాటించేందుకు ఎవరికీ అందరికీ అంత సమయం దొరకడం లేదు. అయితే ఈ చిట్కాల ద్వారా తక్కువ సమయంలోనే మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా, యవ్వనంగా, అందంగా ఉంచుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం.
చర్మ ఉత్పత్తులను ఉపయోగించండి:
చలికాలంలో చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా ఉండకుండా ఉండేందుకు.. సరైన చర్మ ఉత్పత్తులను ఉపయోగించాలి. అవి ఉపయోగించడం ద్వారా.. చర్మం నిర్జీవంగా, పొడిబారకుండా కాపాడుకోవచ్చు. అయితే జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు.. లోషన్స్, మాయిశ్చరైజర్స్ వినియోగించవద్దు. అవి వాడడం వల్ల.. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో చర్మం పగుళ్ళకు దారి తీస్తుంది. అందుకే సరైన చర్మ ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్ వాడాలి:
సాధారణంగా చలికాలంలో మధ్యాహ్నం సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా చర్మం పొడిబారి మొత్తం పగులుతుంది. అలాంటి సమయంలో ఎండల నుంచి రక్షణతో పాటు చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్ వాడాలి. ఇవి వాడడం వల్ల ఎండల నుంచి చర్మాన్ని రక్షించుకోవడంతో పాటు.. చర్మం తేమతో, నిర్జీవంగా మారకుండా ఉంటుంది.
గోరువెచ్చని నీటిని ఉపయోగించండి:
సాధారణంగా చలికాలంలో ప్రతి ఒక్కరూ వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. ఆ నీళ్ళల్లో ఉండే అధిక వేడి.. చర్మంలోని తేమనంతా పీల్చేసి, చర్మాన్ని పొడిబారుస్తుంది. ఇలాంటి సమయాల్లో చర్మం పొడి బారకుండా ఉండేందుకు.. గోరు వెచ్చని నీతితో స్నానం చేయడం ఉత్తమం. దీంతో చర్మం పొడిబారకుండా ఉండడంతో పాటు అందంగా, యవ్వనంగా ఉంటుంది.
సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం:
మనందరికీ తెలుసు.. పండ్లు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని. దీంతో వైద్యులు సైతం పండ్లను తినాలని సూచిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. యాంటీ యాక్సిడెంట్లు అధికంగా లభించే సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం వల్ల.. చర్మం అందంగా, ఆరోగ్యాంగా ఉంటుంది.
అంతేకాకుండా చేపలు, గుడ్లు, బాదం వంటి ఒమేగా ఫ్యాట్-3 వంటి ఔషధ గుణాలుండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, చర్మానికి కూడా మేలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో తీవ్రంగా బాధపెట్టే పగుళ్లు వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
గమనిక: ఈ కథానాంశంలో పొందుపరిచిన విషయాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications