Latest Updates
-
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026
ఆస్తమా బాధితులారా అలెర్ట్.. చలికాలం వచ్చింది, ఈ జాగ్రత్తలు మస్ట్!
నవంబర్ మూడో వారం వచ్చేసింది. నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు మెల్లగా పడిపోతున్నాయి. చల్లటి గాలులు పలకరిస్తున్నాయి. ఆస్తమా బాధితులకు మాత్రం ఇది ప్రమాద ఘంటిక మోగించే సమయం. చలి తీవ్రత పెరిగే కొద్దీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో నొప్పి, ఆస్తమా అటాక్‌లు పెరిగే అవకాశం ఉంటుంది.
మనదేశంలో 3 కోట్ల మందికిపైగానే ఆస్తమాతో బాధపడుతున్నట్లు ఓ రిపొర్ట్ చెబుతోంది. ఇది వాయుమార్గాల వాపుకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక సమస్య. ఈ వ్యాధి ఉన్నవారిలో శ్వాసనాళాలు ఉబ్బి, కుచించుకుపోయి, అధిక శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల దగ్గు, ఆయాసం, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఈ బాధ వర్ణనాతీతం. వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఈ వ్యాధి.. చల్లని పొడి గాలి, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇంటి లోపల ఉండే అలర్జీ కారకాల వల్ల శీతాకాలంలో మరింత తీవ్రమవుతుంది.
రక్షణ కవచం లాంటి జాగ్రత్తలు
ముందస్తు జాగ్రత్తే ఆస్తమాకు అసలైన మందు. ఈ చలికాలంలో ఆస్తమాను అదుపులో ఉంచుకోవడానికి, సమస్య రాకముందే ఈ కింది జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.
స్కార్ఫ్ లేదా మాస్క్ ముఖ్యం: ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ముక్కు, నోటిని కవర్ చేస్తూ స్కార్ఫ్ లేదా మాస్క్ ధరించండి. ఇది చల్లని గాలిని నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుని, గాలిని వెచ్చగా, తేమగా మార్చి లోపలికి పంపుతుంది.
సమయం చూసి అడుగులేయండి: ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉండే తెల్లవారుజామున లేదా రాత్రి వేళల్లో వాకింగ్, వ్యాయామం కోసం బయటకు వెళ్లడం మానుకోండి.
వెచ్చదనం అవసరం: శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా ఎల్లప్పుడూ వెచ్చని దుస్తులు స్వెటర్లు, మఫ్లర్లు ధరించండి.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి: చలికాలంలో తలుపులు మూసి ఉంచడం వల్ల దుమ్ము, బూజు, పురుగులు పెరిగిపోతాయి. కాబట్టి ఇంట్లోకి సూర్యకాంతి, గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి.
తేమ సమతుల్యత: హీటర్లు వాడేవారు గదిలో గాలి మరీ పొడిగా మారకుండా చూసుకోవాలి. అవసరమైతే హ్యూమిడిఫైయర్ వాడటం మంచిది.
పొగకు దూరంగా: దోమల కాయిల్స్ పొగ, సిగరెట్ పొగ ఆస్తమాను వెంటనే ప్రేరేపిస్తాయి. వీటిని పూర్తిగా నివారించండి.
ఇన్హేలర్ మరువద్దు: రిలీవర్ ఇన్హేలర్ ను ఎప్పుడూ మీ వెంటే ఉంచుకోండి. డాక్టర్ల సలహా మేరకు దాన్ని వాడండి.
మందులే రక్ష: డాక్టర్ సూచించిన కంట్రోలర్ మందులు లేదా నివారణ ఇన్హేలర్లను ఒక్క రోజు కూడా మానకుండా వాడాలి.
టీకాలు: చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ ఆస్తమాను పెంచుతాయి. కాబట్టి డాక్టర్ ని సంప్రదించి ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవడం ఉత్తమం.
పరిశుభ్రత: ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తరచుగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. జలుబు, దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండాలి.
హైడ్రేషన్: చలి కదా అని నీళ్లు తాగడం తగ్గించవద్దు. గోరువెచ్చని నీరు లేదా కెఫిన్ లేని వేడి పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల వాయుమార్గాల్లో శ్లేష్మం పలుచబడి శ్వాస తేలికగా ఆడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications