Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడే జ్యూస్ ఇదే
ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది.చలికాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్ అనేక అనారోగ్య సమస్యలను వెంటబెట్టుకు వస్తుంది. జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యల నుండి, రోగనిరోధక శక్తి తగ్గడం వరకు మన శరీరం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ శీతాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మీ రోజువారీ ఆహారంలో బీట్ రూట్,దానిమ్మ రసాన్ని భాగం చేసుకోండి.
శీతాకాలంలో మీ శరీరాన్ని ఉక్కులా మార్చి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఒక అద్భుత పానీయయే బీట్ రూట్ దానిమ్మ రసం. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ జ్యూస్ చలికాలంలో మనకు ఒక రక్షక కవచంలా పనిచేస్తుంది. దీనిని రోజూ తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలను ఇక్కడ చూడండి.

రోగనిరోధక శక్తికి తిరుగులేదు
చలికాలంలో వైరస్ లు, బ్యాక్టీరియాల దాడి ఎక్కువగా ఉంటుంది. బీట్ రూట్, దానిమ్మ రెండింటిలోనూ విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని తెల్ల రక్త కణాలను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు జ్యూస్ తాగితే సీజనల్ వ్యాధులు మీ దరిచేరడానికి భయపడతాయి.
రక్తహీనతకు దివ్యౌషధం
చాలామంది ముఖ్యంగా మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. అలసట, నీరసం వారిని వేధిస్తుంటాయి. ఐరన్ లోపాన్ని సరిచేయడానికి బీట్ రూట్, దానిమ్మ జ్యూస్ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని వేగవంతం చేసి, హిమోగ్లోబిన్ లెవల్స్ ను అమాంతం పెంచుతుంది. మీరు చురుగ్గా, ఉత్సాహంగా ఉండటానికి ఇది దోహదపడుతుంది.
గుండె పదిలం - ఆరోగ్యం సుస్థిరం
ప్రస్తుత కాలంలో గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఈ జ్యూస్ లో ఉండే పొటాషియం, నైట్రేట్లు రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది రక్త నాళాలను వ్యాకోచింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీర్ణ సమస్యలకు చెక్
చలికాలంలో దాహం తక్కువగా వేయడం వల్ల నీరు తక్కువగా తాగుతుంటాం, ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది. బీట్ రూట్, దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
మెరిసే చర్మం
చలిగాలికి చర్మం పొడిబారడం, కాంతిని కోల్పోవడం సహజం. ఖరీదైన క్రీములు వాడే బదులు ఈ జ్యూస్ తాగి చూడండి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఫలితంగా మొటిమలు, మచ్చలు తగ్గి, మీ చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా మెరుస్తుంది. ఇది నేచురల్ బ్యూటీ డ్రింక్ అని చెప్పవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
