Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ సింపుల్ టిప్స్‌తో ఎలాంటి తలనొప్పినైనా క్షణాల్లోనే తగ్గించుకోవచ్చు
తలనొప్పి అనేది చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. కానీ అది వచ్చినపుడు ఆ బాధను చాలా ఇబ్బంది కలిగిస్తుంది. తలనొప్పి అనేక కారణాలతో వస్తుంది. అయితే, ఆకస్మికంగా వచ్చే తలనొప్పిని కొంత వరకు ఇంటి చికిత్సలతో తగ్గించుకోవచ్చు. కొన్ని సార్లు, మందుల అవసరం లేకుండా కొన్ని సహజమైన పద్దతిలో ఈ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే ఈ స్టోరీలో ఎలాంటి చిట్కాలతో తలనొప్పిని ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ఏ విధంగా ఈ చిట్కాలు పాటించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అల్లం
అకస్మాత్తుగా తలనొప్పి వస్తే, అల్లం సహాయపడుతుంది. అల్లం రక్త నాళాలలో వాపును తగ్గించి నొప్పిని నిర్వారిస్తుంది. అల్లం రసం మరియు నిమ్మరసం సమానంగా తీసుకొని కలిపి తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం ఎసెన్స్ ఉన్న మిఠాయిలను తినడం లేదా అల్లం నీటిలో మరిగించి తాగడం కూడా మంచి ఫలితాలు వస్తాయి.

అలాగే దాల్చిన చెక్క కూడా తలనొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కను పొడి చేయించి, కొంచెం నీటితో తడిపి పేస్ట్ తయారుచేసి, ఆ పేస్టును తలపై అప్లై చేయండి. 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
లవంగాలు:
లవంగాలు కూడా తలనొప్పి నుంచి ఉపశమనం ఇచ్చే మంచి పరిష్కారం అని చెప్పొచ్చు. కొన్ని లవంగాలను శుభ్రమైన గుడ్డలో కట్టి, వాటిని వాసన చూస్తూ ఉంచడం ద్వారా నొప్పి తగ్గుతుంది. మల్లెపూలు కూడా తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. జాస్మిన్ పువ్వుల టీ తాగడం తలనొప్పిని తగ్గించుకోవడానికి మంచి మార్గం. ఈ టీకి తేనె కలిపి తాగితే, రుచి కూడా బాగా ఉంటుంది, తలనొప్పి తగ్గుతుంది. ఈ సహజ పద్ధతులు ఆకస్మిక తలనొప్పిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications