Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ చిన్న టిప్‌తో నోటిపూత నుంచి బయటపడొచ్చు.. మళ్ళీ జన్మలో నోటిపూత రాదు! ఏం చేయాలంటే?
మనలో చాలా మందికి సీజన్‌తో సంబంధం లేకుండా నోటి పూత వస్తుంటాయి. దీని కారణంగా చాలా మంది తీవ్రంగా బాధపడుతుంటారు. అలాగే ఆ నొప్పిని భరించలేక ఏడుస్తుంటారు. ఇది పెదాలతో, పెదాలపై.. నాలుక మీద ఎక్కువగా వస్తుంటాయి. ఈ నోటి పూత కారణంగా అన్నం తినడం, నీరు తాగడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీనిని తగ్గించుకునేందుకు రకరకాల మెడిసిన్స్ వాడుతుంటారు. కానీ ఆ నోటిపూత నుంచి ఉపశమనం పొందలేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ స్టోరీలో ఈ నోటిపూత ఎందుకు వస్తుంది? దీని నుంచి ఎలా ఉపశమనం పొందాలి? నోటిపూతను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం.

నోటిపూత ఎందుకు వస్తుంది?
నోటి పూత రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మన శరీరంలో B12 విటమిన్ లోపం ఉండడం. అలాగే నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, నోటి సమస్యల కారణంగా ఈ నోటిపూత సమస్య వస్తుందని చాలా మంది డాక్టర్లు చెబుతుంటారు. ఈ సమస్యల వల్ల నోటిపూత వస్తుందని పేర్కొంటుంటారు. ఈ నోటిపూత వస్తే ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. అందులో ఒక దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం..
ఆ పద్ధతి ఏంటంటే..
నోటిపూత నుంచి బయటపడడానికి మనం ఎక్కువగా B12 విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ B12 విటమిన్ మనకు ఎక్కువగా బియ్యంలో దొరుకుతుంటుంది. మనం బియ్యం ఉడికించినప్పుడు.. దాని చుట్టూరా నీళ్లు ఊరుతుంటాయి. ఆ గంజి నీటిలో B12 విటమిన్ పుష్కలంగా ఉంటాయి. బియ్యంలో ఆ పోషకాలు నీటి రూపంలో కరిగి.. గంజిలాగా తయారై.. మనకు B12 విటమిన్‌ను అందిస్తుంటాయి. ఇవి చాలా మంచి ప్రయోజనాలను కలుగజేస్తాయి.
ఎలా తీసుకోవాలంటే..
మన శరీరానికి B12 విటమిన్ పుష్కలంగా, సమృద్ధిగా, సమతుల్యంగా అందాలంటే ఈ బియ్యం గంజిని సరిగ్గా తీసుకోవాలి. అందుకోసం బియ్యం నీటిని ఒక గ్లాసులో తీసుకోవాలి. ఒక మూడు పెద్ద చెంచాల నీటిని తీసుకోవాలి. గంజిలో కొంచెం గల్ల ఉప్పు జోడించాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. అనంతరం కొంచెం చల్లగా అయిన తరువాత తాగితే సరిపోతుంది. ఇలా రెండు మూడు రోజుల పాటు తీసుకుంటే నోటిపూత నుంచి బయటపడవచ్చు. ఇవి పూర్తిగా సురక్షితం కావడంతో పాటు.. ఇందులోని పోషకాలు ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే ఎంతో ఇబ్బందిని కలిగించే నోటిపూత సమస్య నుంచి బయటపడొచ్చు.
దీంతో పాటు..
నోటిపూత నుంచి బయటపడడానికి కేవలం ఈ గంజిని తీసుకోవడం మాత్రమే కాదు.. మరికొన్ని చిట్కాలు కూడా పాటిస్తే సరిపోతుంది. అందులో ఒకటి రాత్రి పడుకునే ముందు నోటిపూతపైన కొబ్బరి నూనెను రాసుకొని పడుకుంటే ఆ నోటిపూత నుంచి సత్వరమే ఉపశమనం పొందవచ్చు. అలాగే ఎండు కొబ్బరి పొడి, గసగసాలు తీసుకున్నా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే ఇవన్నీ పూర్తిగా ఆరోగ్యవంతమైనవే. వీటిని తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు కూడా రావు. అందుకే ఈసారి మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications