Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ 4 ఫ్రూట్స్‌తో ప్రమాదాన్ని అరికట్టొచ్చా.?
ఇటీవలి కాలంలో మహిళలు ఆరోగ్యపరంగా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య రొమ్ము క్యాన్సర్. జన్యుపరమైన కారణాలు, జీవనశైలిలో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు ఇలా పలు కారణాలు బ్రెస్ట్ క్యాన్సర్‌కి దారితీస్తున్నాయి. అయితే మహిళలు రోజువారీ ఆహారంలో అధికంగా పండ్లు చేర్చుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 7శాతం తగ్గుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏంటో చూద్దాం..

తరచుగా ఆపిల్ పండ్లు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. వీటిలోని పాలీఫెనాల్స్.. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది. కణితులు వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది. అంతేకాకుండా ఆపిల్స్‌ను తొక్కతో సహా తినాలని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని ట్రైటెర్పెనాయిడ్స్.. క్యాన్సర్ కణితి పెరుగుదలను నివారిస్తుంది. సాయంత్రం సమయంలో స్నాక్స్‌లాగా రోజూ ఒక ఆపిల్‌ను తినడం శ్రేయస్కరం.
బెర్రీ ఫ్రూట్స్‌లో రకాలైన బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీలు.. పోషకాల పరంగా అత్యుత్తమమైనవని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడతాయి. యాంటీఆక్సిడెంట్లగానూ పనిచేస్తాయి. తరచుగా వీటిని ఓట్‌మీల్, స్మూతీలలో కలుపుకొని తినడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.

చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు సమృద్ధిగా ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదానికి చెక్ పెట్టొచ్చట. ముఖ్యంగా ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుదల, వ్యాప్తి మందగించేలా చేస్తుంది. ఇంకా వీటిలో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ సైతం వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో వీటిని వారంలో మూడు లేదా నాలుగు రోజులు గుప్పెడు గుప్పెడుగా తింటే చాలు. సలాడ్ రూపంలో తీసుకుంటే తినడానికి రుచికరంగా ఉండటంతో పాటు వ్యాధి ప్రమాదాన్ని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, అత్తి పండ్లు, ఎండు రేగు పండ్లు క్యాన్సర్ ప్రమాద కారకాలను నివారించడంలో దోహదపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లు క్యాన్సర్ కణతులు పెరగకుండా నిరోధిస్తాయి. ఒక కప్పు తాజా పండ్లతో పోలిస్తే, ఈ ఎండిన పండ్లను పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ప్రతిరోజూ వ్యాయామం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం, జంక్ ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్‌కి దూరంగా ఉండటం ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
