Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
World Blood Donor Day 2025: రక్తదానం చేయాలి అనుకుంటున్నారా? ముందు ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి
మీరు ఇవ్వగల అత్యంత విలువైన బహుమతి ఏది? డబ్బు, వస్తువులు, ఖరీదైన కానుకలు.. ఇవేవీ ఒక ప్రాణం ముందు సరితూగవు. కానీ కేవలం పదిహేను నిమిషాల మీ సమయం, మీ శరీరంలోని కొద్దిపాటి రక్తం..ఒకరి ప్రాణాన్ని నిలబెట్టగలదు. రక్తదానం అంతకంటే గొప్ప దానం మరొకటి లేదు. ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటాం. నిస్వార్థంగా రక్తదానం చేసే మహానుభావులను గౌరవించడమే కాకుండా, ఈ ప్రాణరక్షక కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ప్రజలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
2025 ప్రపంచ రక్తదాతల దినోత్సవం థీమ్..రక్తం ఇవ్వండి,ఆశను ఇవ్వండి..కలిసి మనం ప్రాణాలను కాపాడుదాం(Give blood, give hope: together we save lives). రక్తదానం అనేది కేవలం ఒకరి అవసరాన్ని తీర్చడం కాదు, అది సమాజం పట్ల మనకున్న బాధ్యతను చాటిచెప్పే ఒక మానవీయ చర్య. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి,పెద్ద ఆపరేషన్స్ చేయించుకునే వారికి, క్యాన్సర్ రోగులకు, ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే తల్లులకు, థలసేమియా వంటి వ్యాధులతో బాధపడే చిన్నారులకు ఇలా ఎందరికో రక్తం జీవనాధారం. మీ ఒక్క రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడగలదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

అయితే రక్తదానం చేయాలనే గొప్ప సంకల్పం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ దానికి అర్హులు కారు. దాత, గ్రహీత ఇద్దరి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, WHO కొన్ని కచ్చితమైన నియమాలను నిర్దేశించాయి. ఆ రూల్స్ ప్రకారం ఎవరు రక్తదానం చేయవచ్చు..ఎవరు రక్తదానం చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
రక్తదానం ఎవరు చేయకూడదో ఇక్కడ చూడండి
అనారోగ్యంతో ఉన్నవారు: రక్తదానం చేయాలనే గొప్ప మనస్సు ఉన్నా కూడా కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం రక్తదానం చేయకపోవడమే మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని అలాగే మీరు రక్తం దానం చేయాలనుకుంటున్న వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన కీలకమైన నిబంధన. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, షుగర్, అధిక రక్తపోటు, క్యాన్సర్ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు రక్తదానానికి అర్హులు కారు. ఈ పరిస్థితుల్లో మీ శరీరం ఇప్పటికే ఒత్తిడిలో ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మీ రక్తం స్వీకరించే వ్యక్తికి కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
ప్రెగ్నెంట్,పాలిచ్చే తల్లి: గర్భిణీగా ఉన్నప్పుడు లేదా బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు రక్తదానం చేయకూడదు. ఈ సమయంలో తల్లి శరీరానికి అదనపు రక్తం, ఐరన్, పోషకాలు చాలా అవసరం. పెరుగుతున్న బిడ్డకు లేదా పాలు ఉత్పత్తి చేయడానికి ఇవి కీలకం. రక్తదానం చేయడం వల్ల తల్లి శరీరం మరింత బలహీనపడవచ్చు, రికవరీకి ఎక్కువ సమయం పట్టవచ్చు, కొన్నిసార్లు బిడ్డ ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపవచ్చు. తల్లి, బిడ్డ ఇద్దరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నియమం పెట్టబడింది. మీ శరీరం పూర్తిగా కోలుకొని, బలంగా మారేంత వరకు వేచి ఉండటమే సరైన నిర్ణయం.
రక్తహీనత,తలసేమియా: కొంతమందికి సహజంగానే రక్తహీనత (ఎనీమియా) ఉంటుంది.. అంటే వారి శరీరంలో తగినంత రక్తం లేదా హిమోగ్లోబిన్ ఉండదు. అలాగే తలసేమియా వంటి కొన్ని జన్యుపరమైన వ్యాధులు ఉన్నవారిలో రక్తం ఉత్పత్తిలో తీవ్రమైన సమస్యలు ఉంటాయి. వీరికి రక్తం అవసరం ఉంటుంది కాబట్టి వీరు ఇతరులకు రక్తదానం చేయడానికి అర్హలు కాదు.

ఆపరేషన్,ఇన్ఫెక్షన్: మీరు ఇటీవల ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నారా, కొత్తగా టాటూ వేయించుకున్నారా లేదా ఏదైనా పెద్ద అనారోగ్యం నుండి కోలుకుంటున్నారా? అయితే మీరు రక్తదానం చేయడానికి కనీసం 6 నెలల వరకు వేచి ఉండటం తప్పనిసరి. ఎందుకంటే సర్జరీలు, టాటూలు లేదా తీవ్రమైన అనారోగ్యాలు మీ శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ సమయంలో మీ రక్తం బలహీనంగా ఉండవచ్చు లేదా మీ శరీరంలో ఏదైనా దాగి ఉన్న ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం చేస్తే అది మీకు ఇబ్బంది కలిగించవచ్చు, అంతేకాకుండా మీరు దానం చేసిన రక్తం స్వీకరించే వ్యక్తికి కూడా ప్రమాదకరంగా మారవచ్చు. మీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడి, శరీరం బలంగా మారడానికి ఈ 6 నెలల సమయం చాలా అవసరం.
HIV, హెపటైటిస్: HIV పాజిటివ్‌గా ఉన్నవారు లేదా హెపటైటిస్ B/C వంటి వ్యాధులు ఉన్నవారు రక్తదానానికి అనర్హులు. ఎందుకంటే ఈ వైరస్ లు రక్తం ద్వారా ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది.
ఎవరు రక్తదానం చేయవచ్చు
-18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతులు మాత్రమే రక్తదానం చేయడానికి అర్హులు. ఈ వయస్సు పరిమితి దాత, గ్రహీత ఇద్దరి భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించబడింది.
-రక్తదానం చేసే వ్యక్తి కనీసం 50 కిలోల బరువు ఉండాలి. తగినంత బరువు ఉన్నవారి నుండి రక్తం తీసినప్పుడు వారి ఆరోగ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లదని నిర్ధారించడానికి ఈ ప్రమాణం తప్పనిసరి.
-పురుషులకు కనీసం 13 g/dL.. మహిళలకు 12.5 g/dL హిమోగ్లోబిన్ స్థాయి అవసరం. హిమోగ్లోబిన్ శరీరంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే కీలకమైన ప్రోటీన్. ఈ స్థాయిలు తక్కువగా ఉంటే రక్తదానం చేయడం వల్ల దాత బలహీనపడే అవకాశం ఉంటుంది.
-రక్తదానం చేసే ముందు వ్యక్తికి ఎలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, జ్వరం, జలుబు, దగ్గు లేదా అలెర్జీలు ఉండకూడదు. సంపూర్ణ ఆరోగ్యం రక్తదానానికి అత్యవసరం.

ఇది గుర్తుంచుకోండి
-రెండు రక్తదానాల మధ్య కనీసం 3 నెలల సమయం ఉండాలి. ఈ కాలం దాత శరీరం కోల్పోయిన రక్తాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకోవడానికి సహాయపడుతుంది.
-దాత మద్యం, ధూమపానం లేదా మరే ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యసనాలు రక్త నాణ్యతను ప్రభావితం చేయగలవు, దాత ఆరోగ్యాన్ని దెబ్బతీయగలవు.
-రక్తదానం కోసం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. రక్తదానానికి 2 గంటల ముందు తేలికపాటి భోజనం చేయడం మంచిది, ఇది రక్తదానం తర్వాత తలతిరగడం వంటి వాటిని నివారిస్తుంది.
-రక్తదానం చేసిన తర్వాత కనీసం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే తగినంత నీరు, పండ్ల రసాలు త్రాగాలి. ఇది శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది, అలసటను నివారిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications