Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మన శరీరానికి మెదడు మదర్‌బోర్డు లాంటిది. బ్రెయిన్ హెల్త్ సరిగా ఉంటేనే శరీరంలో మిగతా భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. కాగా, ప్రతి యేటా జులై 22న మెదడు ఆరోగ్య దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ క్రమంలో బ్రెయిన్ హెల్త్‌పై అవగాహన పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మెదడు ఆరోగ్యం కోసం విటమిన్ బి12 చాలా కీలకమని చెబుతున్నారు. బి12 లోపంతో మెదడు పనితీరు దెబ్బ తింటుంది.

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా జనజీవనం ఉరుకులుపరుగులుగా మారింది. ఎక్కువ శాతం మంది కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం, లేట్ నైట్ షిఫ్టులు, ఆహారంలో మార్పులు ఇలా పలు కారణాల వల్ల మెదడు ఆరోగ్యం బలహీనపడుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యం రాకముందే అల్జీమర్స్ రావడం, ఏకాగ్రత లోపం, నిరంతరం ఒత్తిడి ఎదుర్కోవడంతో ఇతర ఆరోగ్య సమస్యలు మెదడు బలహీనపడుతుందనే దానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. అందుకే మెదడు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఈ రోజు ప్రపంచ మెదడు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మెదడుకి విటమిన్ బి12 కి మధ్య కీలక సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.
2014లో ప్రారంభం
మెదడు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా నాడీ సంబంధింత వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, మెరుగైన చికిత్సపై వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూమరాలజీ దృష్టి సారించింది. ఈ మేరకు 2014లో మెదడు ఆరోగ్య దినోత్సవాన్ని తీసుకొచ్చింది.

ఇవే ప్రధాన కారణాలు
మెదడు ఆరోగ్యం అంటే మొదటగా ఒత్తిడి గురి కావడం గుర్తుకొస్తుంది. నిద్ర లేమి, వ్యాయామం లేకపోవడం వీటి కారణంగా మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. అయితే వీటితో పాటు విటమిన్ బి12 లోపం కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని గుర్తించాలి. బ్రెయిన్, నాడీ వ్యవస్థ పనితీరులో ఈ విటమిన్ కీలకం. మన నరాలను కప్పి ఉంచే మైలిన్ పొర ఆరోగ్యాన్ని కాపాడటానికి విటమిన్ బి 12 దోహదపడుంది. ఈ పొర మెదడు నుంచి శరీరానికి, శరీరం నుంచి మెదడుకి సంకేతాలను కచ్చితంగా, వేగంగా ప్రసారం చేస్తుంది. ఈ క్రమంలో విటమిన్ బి12 లోపిస్తే ఈ సందేశాల ప్రసారంలో అంతరాయం ఏర్పడుతుంది.
ఎర్రరక్త కణాలకి కీలకం
విటమిన్ బి12 మెదడు ఆరోగ్యానికే కాదు, డీఎన్‌ఏ, ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి దోహదపడుతుంది. మన శరీరంలో ప్రతి భాగానికి, మెదడుకి ఆక్సిజన్‌ను సక్రమంగా చేరవేయడంలో ఎర్ర రక్త కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే మీ రోజువారీ ఆహారంలో తగినంత స్థాయిలో విటమిన్ బి12 ఉండటం అవసరం.
విటమిన్ బి12 లోపిస్తే దాని లక్షణాలు క్రమంగా కనిపించడం ప్రారంభమవుతాయి. మతిమరుపు, ఏకాగ్రత లోపించడం, గందరగోళం, మానసిక స్థితుల్లో మార్పులు ఈ విటమిన్ లోపానికి సంకేతాలుగా గుర్తించాలి. చేతులు, కాళ్లలో జలదరింపు, తిమ్మిరి కూడా విటమిన్ బి12 లోపంతో ఏర్పడతాయి. నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
వీరిలో ప్రమాదం ఎక్కువ
వృద్ధాప్యంలో ఉన్నవారు, శాకాహారం మాత్రమే తీసుకునేవారు, విటమిన్ బి12ను సరిగ్గా గ్రహించలేని ఆరోగ్య స్థితులు ఉన్నవారిలో ఈ విటమిన్ లోపం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లయితే సంబంధిత వైద్యుడిని సంప్రదించి సరైన ఆహారం, సప్లిమెంట్స్, ఇంజెక్షన్లతో విటమిన్ బి12 లోపాన్ని నివారించవచ్చు.

విటమిన్ బి12 లభించే ఆహార పదార్థాలు
సీ ఫుడ్, మాంసంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. గుడ్లలోని పచ్చ సొన, పాల ఉత్పత్తులు.. పాలు, పెరుగు, చీజ్, పన్నీర్ వంటి వాటిని తరచుగా తీసుకోవాలి. మొక్కల నుంచి లభించే కూరగాయల్లో విటమిన్ బి12 ఉండని కారణంగా శాకాహారులు ఫోర్టిఫైడ్ సెరియల్స్, న్యూట్రిషనల్ ఈస్ట్, సోయా, బాదం, లేదా ఓట్ మిల్క్ వంటి వాటిని తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications