Latest Updates
-
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.?
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
రోజూ ఆఫీస్ నుంచి రాగానే విపరీతమైన అలసట.. చిన్న చిన్న విషయాలకే మతిమరుపు.. పనిలో ఏకాగ్రత లోపించడం.. తరచుగా వేధించే తలనొప్పి. ఇవన్నీ ప్రస్తుతం మనలో చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్యలే. వెంటనే మనం ఇదంతా ఆఫీస్ టెన్షన్, నిరంతరం ల్యాప్ ప్, మొబైల్ స్క్రీన్లు చూడటం, పెరిగిపోతున్న బాధ్యతల వల్లే అని సరిపెట్టుకుంటాం. కానీ రోజువారీ జీవితంలో సర్వసాధారణం అనిపించే ఈ లక్షణాల వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉండొచ్చని మీకు తెలుసా?

దీర్ఘకాలికంగా వేధించే ఈ నాడీ సంబంధిత లక్షణాలు కేవలం ఒత్తిడి వల్ల వచ్చేవి కాకపోవచ్చు, అవి ప్రాణాంతకమైన మెదడు కణితి(బ్రెయిన్ ట్యూమర్) కి సంబంధించిన తొలి సంకేతాలు కావచ్చని న్యూరాలజిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ కణితి ఆధునిక జీవనశైలి సమస్యల ముసుగులో ఏళ్ల తరబడి దాగి ఉండే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
చాలామందికి మెదడు కణితికి సంబంధించిన ప్రాథమిక లక్షణాలు సాధారణ ఆరోగ్య సమస్యల్లాగే అనిపిస్తాయని..అందుకే వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతుంది. పనిభారం, మానసిక ఒత్తిడి లేదా వయసు పైబడటం వల్లే ఇలా జరుగుతోందని భ్రమపడి, అసలు సమస్యను ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారని చెబుతున్నారు. మనం సాధారణం అనుకుని వదిలేసే కానీ, తీవ్రమైన శ్రద్ధ వహించాల్సిన కొన్ని ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు ఇక్కడ చూడండి.
మతిమరుపు, ఏకాగ్రత లోపం
కారణం లేకుండా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి కేవలం నిద్రలేమి వల్లే రావు. మెదడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే భాగాలలో ఏర్పడే కణితుల వల్ల ఏకాగ్రత, రోజువారీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింటాయి.
మారిన తలనొప్పి తీరు
తలనొప్పి రావడం అత్యంత సాధారణం, అన్నీ కణితులు కావు. కానీ అది బ్రెయిన్ ట్యూమర్ కి ఎప్పుడు సంకేతం ఎప్పుడవుతుందంటే.. తలనొప్పి తరచుగా వస్తూ, రోజురోజుకూ దాని తీవ్రత పెరుగుతున్నప్పుడు అప్రమత్తం కావాలి. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే వచ్చే భయంకరమైన తలనొప్పి, అలాగే దగ్గినప్పుడు, కిందకు వంగినప్పుడు లేదా శారీరక ఒత్తిడికి గురైనప్పుడు తీవ్రమయ్యే నొప్పులకు లోతైన మెడికల్ టెస్టులు అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
కంటిచూపు మందగించడం
చూపు మసకబారడం, వస్తువులు రెండుగా కనిపించడం, పక్క చూపులు కోల్పోవడం వంటివి జరిగితే వెంటనే స్క్రీన్ టైమ్ ఎక్కువైందని సర్దుకుపోతాం. కానీ ఇవి మెదడులోని కంటి నరాలపై కణితి ఒత్తిడి పెంచడం వల్ల కూడా జరగవచ్చు.

ప్రవర్తన, మానసిక స్థితిలో మార్పులు
మీ ఆత్మీయులు ఎవరైనా అకారణంగా చిరాకు పడుతున్నా, ఒంటరిగా ఉంటున్నా, లేదా విపరీతమైన ఆందోళనకు గురవుతున్నా కుటుంబ సభ్యులు వెంటనే గమనించాలి. భావోద్వేగాలను, విచక్షణను నియంత్రించే మెదడు భాగంలో కణితి ఏర్పడినప్పుడు ఇలాంటి అసాధారణ ప్రవర్తనా మార్పులు సంభవిస్తాయి.
మాట తడబడటం
ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవడం కూడా మెదడు కణితి లక్షణాలలో భాగమే. దీనిని చాలామంది కేవలం మానసిక అలసటగా పొరబడుతుంటారు.
బ్యాలెన్స్ దెబ్బతినడం, మూర్ఛ
నడుస్తున్నప్పుడు తూలిపోవడం, పదే పదే తలతిరగడం, వివరించలేని అలసట వంటివి శరీర కదలికలను నియంత్రించే మెదడు భాగంలో వస్తున్న మార్పులకు సంకేతాలు. పెద్దవారిలో అకస్మాత్తుగా మూర్ఛ(ఫిట్స్) రావడం అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. మొదటిసారి మూర్ఛ వచ్చిన వెంటనే దానిని నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్ వెళ్లి టెస్టులు చేయించుకోవడం అత్యవసరం.
అయితే ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో అని భయపడిపోవాల్సిన పనిలేదు. సాధారణ తలనొప్పులు, మతిమరుపు ఒత్తిడి వల్లే వస్తాయి. కానీ ఈ లక్షణాలు వారాల తరబడి కొనసాగుతున్నా, రోజురోజుకూ వాటి తీవ్రత పెరిగి ఆటంకం కలిగిస్తున్నా లేదా అన్నీ ఒకేసారి కనిపిస్తున్నా వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవడం బెటర్ ని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications