Latest Updates
-
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..
పాలిచ్చే తల్లులు అస్సలే తినకూడని ఆహార పదార్థాలు, వీటిని తింటే బిడ్డకు ఆరోగ్య సమస్యలు రావొచ్చు
గర్భిణీలు అయినా, పాలిచ్చే తల్లులైనా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అనేది తప్పకుండా చూసుకోవాలి. ఇష్టమొచ్చిన తిండి తింటే ఆరోగ్యంగా సమస్యలు వస్తాయి.
మసాలా ఆహారాలు, అతిగా కారంగా ఉన్నవి, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, అధికంగా ఫైబర్ ఉన్న ఆహారాలు లాంటివి తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీ సమయలో, బిడ్డకు పాలిచ్చే సమయంలో ఆహారం విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

పాలిచ్చే తల్లలు తినే ఆహారం కేవలం వారిపైనే కాకుండా.. బిడ్డపైనా ప్రభావం చూపిస్తుంది. పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కెఫిన్:
చాలా మందికి టీ, కాఫీలు తాగనిదే రోజు గడవదు. ఉదయం లేవగానే టీ తాగుతుంటారు. మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రోజుకు కనీసం 3, 4 సార్లు తాగుతుంటారు. పాలిచ్చే తల్లులు వీలైనంత వరకు టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిదని అంటున్నారు వైద్యులు.
కూరగాయలు:
ఉల్లిపాయ, బ్రకొలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ సహా కొన్ని కూరగాయలకు పాలిచ్చే తల్లులు దూరంగా ఉండటం మంచిది. కొన్ని రకాల కూరగాయల వల్ల కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
స్పైసీ ఫుడ్స్:
వంటకాల్లో మసాలా ఎక్కువగా వాడుతుంటాం. దాల్చిన చెక్క, లవంగాలు, సుగంధద్రవ్యాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అందుకే ఈ మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండాలంటారు వైద్యులు.
వెల్లుల్లి:
వెల్లుల్లిని పాలిచ్చే తల్లులు తినాలని చెబుతారు వైద్యులు. వెల్లుల్లి తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని భేషుగ్గా తినవచ్చు. అయితే ఎంత మంచిదైనా సరే మోతాదుకు మించకూడదు.
చాక్లెట్లు:
చాక్లెట్లు అంటే ఎవరికైనా ఇష్టమే. అయితే పాలిచ్చే తల్లులు చాక్లెట్లకు దూరంగా ఉండటమే మంచిది. చాక్లెట్లలో ఉండే కెఫిన్ ఏమాత్రం మంచిది కాదు.
పుదీనా:
ఆహారంలో పుదీనా చేర్చుకోకపోవడమే మంచిది. పుదీనా తినడం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే పుదీనా తీసుకోకపోవడమే మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications