Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
World Heart Day:చిన్నవయస్సులో హార్ట్ అటాక్, జిమ్ లో హార్ట్ అటాక్ తో చనిపోవడానికి కారణాలు, లక్షణాలు, నివారణ
చిన్న వయస్సులోనే హార్ట్ అటాక్ ఎందుకు వస్తాయి అనేదాని మీద అపోలో హాప్సిటల్, జూబ్లిహిల్స్ ప్రముఖ కన్సలెంట్ కార్డియాలజిస్ట్ రామక్రిష్ణ గారు కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్డ్ హార్ట్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం సెప్టెబర్ 29న వరల్డ్ హార్ట్ డేను వర్డ్ హార్ట్ ఫెడరేషన్ వారు జరుపుకుంటారు. గుండె జబ్బుల మీద అవగాహన కల్పించడం కోసం జరుపునే ఈ దినోత్సం ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు వస్తుంది. అలా ఈ సంవత్సరం 'హార్ట్ ఫర్ యాక్షన్' అనే థీమ్ తో ముందుకు వచ్చింది.
హార్ట్ ఫర్ యాక్షన్ అంటే వ్యక్తిగతంగా కాదు పాలసీ పరంగా నిర్ణయాలు తీసుకోవడం. దీని వల్ల అందరూ మోటివేట్ అవుతారు. అలాగే హార్ట్ అటాక్ లను నివారించుకోవడానికి సహాయపడుతుంది.

యుఎస్ లో కార్డియో వ్యాస్కులర్ వాధులతో ప్రతి 34 సెకండ్లుకు ఒక మనిషి చనిపోతున్నారు. హార్ట్ స్ట్రోక్ అనేది నివారంచగలుగుతాం. ఇండియాలో పర్టిక్యురల్ గా నెంబర్ ఇవ్వలేకపోతున్నాం. అందుకు సరైన సమాచారం మనదగ్గ లేదు.
మనం ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉంటే 80శాతం వరకు గుండెజబ్బులను నివారించవచ్చు. చిన్న తనం నుండే మంచి ఆహారం తీసుకోవడం వల్ల గుండెజబ్బులను నివారించగలుగుతాం. దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి. డైట్ తో పాటు చాలా చురుకుగా ఉండాలి. ధూమపానం అస్సలు చేయకూడదు.
స్మోకింగ్ లేదా ప్యాసివ్ స్మోకింగ్ తో హార్ట్ అటాక్ వస్తుందా?
నేను స్మోక్ చేయను కదా స్మోకింగ్ తో హార్ట్ అటాక్ వస్తుందా? ప్యాసివ్ స్మోకింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అంటే స్మోకింగ్ చేయకపోయినా కూడా వస్తుంది. చాలా మంది ఆ ధైర్యంతో ఛాతీలో నొప్పి వచ్చానా నిర్లక్ష్యం చేస్తుంటారు. నొప్పిని గ్యాస్ అనుకుని కొంత నిర్లక్ష్యం చేసి, తర్వాత లేటుగా వస్తుంటారు. కాబట్టి, ఇది ఎవరికైనా రావచ్చు.
వెజిటేరియన్స్ లో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది?
కొలెస్ట్రాల్ అనేది శరీరం ఉత్పత్తి చేస్తుంది. అది మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా లివర్ దీన్ని తయారుచేస్తుంది. కొన్ని జన్యు పరమైన కారణాల వల్ల మనకు ఉండాల్సినదానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంటుంది. ఇలాంటి వారికి భవిష్యత్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్యామిలి పరంగా కూడా ఉంటుంది.
హార్ట్ ఎలా పనిచేస్తుంది?
హార్ట్ కు కుడి వైపున పైన ఎలక్ట్రిసిటి జనరేట్ అవుతుంది. అప్పుడు హార్ట్ తనంతటాను పనిచేస్తుంది. అక్కడి నుండి లోయర్ చాంబర్ కు వెళుతుంది. ఇది నిరంతరం పనిచేస్తుంటుంది. అందుకు హార్ట్ కు సరిపడా రక్త ప్రసరణ అవసరం అవుతుంది. రక్తం ఊపిరితిత్తుల్లో ప్యూరిఫై అయి హార్ట్ కు పంప్ చేయబడని మెదడు, కాళ్ళు, చేతులు, మిగినా శరీర బాగాలన్నింటికి రక్త సరఫరా జరుగుతుంది. అలా గుండుకు నుండి సప్లై అయ్యే రక్తనాళాల్లో ఏదైనా అడ్డు పడితే హార్ట్ అటాక్ వస్తుంది.
హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది
సాధారణంగా షుగర్ పేషంట్స్ లో , హై బ్లడ్ ప్రెజర్, స్మోకింగ్ చేసే వారిలో , ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే వారిలో, హై కొలెస్ట్రాల్ వల్ల ఈ 5 కారణాల వల్లే హార్ట్ అటాక్ వస్తుంది. ఇవేమి లేకపోయినా హార్ట్ అటాక్ రావచ్చు. కానీ ఈ 5 కారణాల వల్ల హై రిస్క్ ఉంటుంది. అలాగే జనటిక్స్ వల్ల కూడా వస్తుంది. ఫ్యామిలిలో ఎవరికైనా ఉన్నా అది జన్యుపరంగా వారి వారసులకు వస్తుంటుంది. ఇంకా సెడెంట్రీ లైఫ్ స్టైల్ , ఊబకాయం అనేవి ప్రస్తుతకాలంలో ఉన్నవి. ప్రస్తుత లైఫ్ స్టైల్ ఆహారపు అలవాట్లు ఊబకాయంకు దారిస్తుంది. ఊబకాయం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి, ఇతర ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
హార్ట్ అటాక్ ను నివారణ లేదా రివర్సింగ్ పద్దతి
డయాబెటిస్ ను మందుల, డైట్ , వ్యాయామం ద్వారా ప్రివెంట్ చేయవచ్చు లేదా రివర్స్ చేయవచ్చు. ఓబేసిటి తగ్గించుకోవచ్చు, మందులు, ఇంజక్షన్లతో హై కొలెస్ట్రాల్ వంటివి తగ్గించుకోవచ్చు. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు.స్మోకింగ్ ను పూర్తిగా మానేయవచ్చు. గుండెకు సంబంధించిన ఇవన్నీ కూడా నివారణ చర్యలో ఉన్నవే.
జిమ్ లో హార్ట్ అటాక్ తో ఎక్కువ మంది చనిపోవడానికి కారణాలు ఏంటి
వ్యక్తులు చూడటానికి ఆరోగ్యంగా, మంచి మజిల్స్ తోటి హెల్తీగా కనిపించి వ్యక్తులు కూడా, అలాంటి వారే జిమ్ లో హఠాన్మరణాలు ఎక్కువగా జరిగాయి. అందుకు కారణం ఉంది. అంతర్గతంగా ఏదో ఒక లోపం ఉంటేనే అలా జరగడానికి అవకాశం ఉంది. హెవీ లిప్ట్ చేసినప్పు హార్ట్ కు పంప్ ఎక్కువ అవ్వడం వల్ల అలా జరగవచ్చు. కానీ దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి.
హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి ముందస్తు లక్షణాలు కనబడుతాయి
90శాతం వరకు శరీరంలో లక్షణాలు అయితే సూచిస్తుంటాయి. ఇక 10 శాతం మందిలో అకస్మాత్తుగా జరుగుతుంటాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా నిద్రలోనే జరుగుతుంటాయి.
హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ కు మద్య తేడ
హార్ట్ అటాక్ అనేది గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడేది. కార్డియాక్ అనేది గుండె సెడెన్ గా ఆగిపోవడం. ఇది ఒక టర్మినల్ ఈవెంట్.
హార్ట్ అటాక్ వచ్చే ముందు శరీరంలో ఏం జరుగుతుంది లక్షణాలు
ఎవరికైనా సరే చాతి ఎడమవైపు బర్నింగ్ గా ఉంటే, నడుస్తుంటే ఇబ్బంది కలిగినా, గొంతు పట్టేసినా, వెన్నుపూసకి మద్యలో లేదా షోల్డర్ ప్లేట్స్ కు మధ్యలో స్టిఫ్ నెస్ గా అనిపిస్తుంది. అలాంటిప్పుడు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి సమయంలో మఖ్యంగా అర్థరాత్రిలో లేస్తుంటే అది ఒక సూచన అని మనం గ్రహించాలి. ఆరోగ్యంగా ఉన్నాసరే ఈ సమయంలో హాస్పిటల్ కు వెళ్ళి ఈసిజి వంటివి చేయించుకోవాలి. లేట్ చేస్తే హార్ట్ బ్లాక్ అయ్యి పెద్ద ప్రమాదమే జరుగుతుంది.
కరోనరీ ఆర్టరీ డిసీజ్
రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు అది ఒత్తడి, వల్ల కొలెస్ట్రాల్ మీద ఉండే లేయర్ తొలగిపోయి, కొలెస్ట్రాల్ రసాయనాలు ఎక్కువ రక్తనాళల్లో కలిసిపోయినప్పుడు, రక్తనాళాలు బ్లాక్ అయ్యా రక్తం సరఫరా అవ్వదు. అలాంటప్పుడు మనకు ఎక్కువ ఛాతీలో నొప్పి, నడబడానికి ఇబ్బంది, ఎక్కువ చెమటలు పట్టడం, అలసిపోవడం, కళ్ళ తిరిగిపడిపోవడం వంటివన్నీ జరుగుతుంటాయి
చిన్న వయస్సులో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది.
ఎలాంటి అలవాట్లు లేకున్నా హార్ట్ అటాక్ వస్తుంటుంది. లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 25 నుండు 30 లోపు ఉన్న వారు స్మోకింగ్ , చెడు అలవాట్లు కూడా కారణం అవుతాయి. ఒక అతనికి స్మోకింగ్ ఉంది, మరొక అతని స్మోకింగ్ అలవాటు లేదు, అయినా రక్తనాల్లో బ్లాక్స్ ఏర్పడాయి.ఇలాంటి సందర్భాల్లో బ్లాక్స్ ఉన్న రక్తనాల్లో స్టంట్స్ వేస్తుంటాం. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు బైపాస్ సర్జరీని ప్రిఫర్ చేస్తాం.
హార్ట్ అటాక్ ను ఎలా నివారించాలి
హెల్తీ ఫుడ్ తినాలి
రెగ్యులర్ వ్యాయామాలు తప్పనిసరి
స్మోకింగ్ మానేయడం
షుగర్ మరియు బిపిలను కంట్రోల్లో ఉంచుకోవడం
రెగ్యులర్ హెల్త్ చెకప్పులు చేయించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











