Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
World liver day 2025: మందు కొట్టకున్నా మీ లివర్ కు ముప్పే..ఈ 5 కారణాల వల్ల కూడా కాలేయం దెబ్బతింటుందట
ప్రతిఏటా ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డేని జరుపుకుంటారు. కాలేయ సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, కాలేయ ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజేయడం దీని ఉద్దేశ్యం. మన శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన, అతిపెద్ద అంతర్గత అవయువం. అనేక కీలక విధులను నిర్వహిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారం, పీల్చే గాలి, శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థాలు, విషపూరితాలను కాలేయం ఫిల్టర్ చేసి శుధ్ధి చేస్తుంది. రాత్రింబగళ్లు కష్టపడుతూ ఉండే కాలేయం ఒక్కసారి పనిచేయడం కొంచెం తగ్గిందంటే..మన మొత్తం ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
అయితే చాలామంది తరచుగా ఎక్కువగా మద్యం తాగడం వల్లనే లివర్ డ్యామేజ్ అవుతుందని..నేను మందు తాగను కదా నాకేం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటుంటారు. అయితే అలా మీరు కూడా అనుకుంటే పొరబడినట్లు. వాస్తవానికి ఆల్కహాల్ ఒక్కటే కాదు..మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా మన లివర్ ని నెమ్మదిగా నాశనం చేస్తాయి. మందు తాగని వాళ్లలో కూడా కాలేయం దెబ్బతినడానికి గల 5 ముఖ్య కారణాలను ఇప్పుడు చూద్దాం.

ఈ 5 కాలేయాన్ని దెబ్బతీస్తాయి
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం మందు తాగితేనే కాలేయ సంబంధిత వ్యాధులు రావు..మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన కాలేయ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD)అనేది ఇటీవల కాలంలో పెద్ద ఆరోగ్య సమస్యగా మారిపోయిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయంతో బాధపడేవాళ్లు, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నోళ్లు..డయాబెటిస్ ఉన్నోళ్లకు, సరైన ఆహారం తీసుకోని వారిలో కూడా ఇది వస్తుందట. ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ లో వేయించిన ఆహార పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుందని..ఇది నెమ్మదిగా కాలేయాన్ని దెబ్బతీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ లక్షణాలు కనబడితే డేంజరే
తరుచుగా బరువు పెరుగుతుండటం, విపరీతమైన అలసట, కడుపులో బరువుగా అనిపించడం లేదా నొప్పిగా ఉండటం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు మీ లివర్ లో ఏదో సమస్య ఉందని సూచిస్తాయి. కరెక్ట్ టైంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకుంటే ఈ చిన్న సమస్యలు తర్వాత కాలేయ సిర్రోసిస్ లేదా ప్రాణాంతకమైన కాలేయ క్యాన్సర్ కు దారితీయవచ్చు అని డాక్టర్లు తెలిపారు.
ఇలా చేయడం మంచిది
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మద్యపానానికి దూరంగా ఉండటం లేదా తగ్గించడం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బరువును అదుపులో ఉంచుకోవాలని..క్రమం తప్పకుండా కాలేయ పనితీరు టెస్టులు చేయించుకోవడం ద్వారా కాలేయ సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..డాక్టర్ల సలహా లేదా సూచనలు లేకుండా ఎలాంటి మెడిసిన్స్ వాడకూడదు. ఇలా చేయడం వల్ల కాలేయం చాలా పెద్ద డేంజర్ లో పడే అవకాశముంటదట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications