Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును మీ వేళ్ళతోనే పసిగట్టండి! కేవలం 5 సెకన్లలో..
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. ఇది ఒక సైలెంట్ కిల్లర్. చాలా సందర్భాలలోవ్యాధి ముదిరి చివరి దశకు చేరుకున్నాక గానీ దాని లక్షణాలు బయటపడవు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే మీ ఆరోగ్యం గురించి ఒక హెచ్చరికను మీ శరీరం ముందుగానే ఇస్తుందని మీకు తెలుసా? మీ చేతి వేళ్లే ఆ రహస్యాన్ని చెప్పగలవు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కేవలం 5 సెకన్ల పాటు ఒక సులభమైన హోం టెస్ట్. దాని పేరే "డైమండ్ ఫింగర్ టెస్ట్". ఇవాళ వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే(World lung cancer day 2025) సందర్భంగా లంగ్ క్యాన్సర్ ను చిన్న హోం టెస్ట్ తో ఎలా గుర్తించవచ్చో ఇక్కడ చూడండి.
ఏమిటీ డైమండ్ ఫింగర్ టెస్ట్? ఎలా చేయాలి?
వైద్య పరిభాషలో "స్కామ్రోత్ విండో టెస్ట్" అని పిలువబడే ఈ పరీక్ష అత్యంత సులభమైనది. దీనిని ఎలా చేయాలి,ఫలితం ఎలా చూడాలో ఇక్కడ చూడండి.

ఎలా చేయాలి: మీ రెండు చేతుల చూపుడు వేళ్లను తీసుకోండి. వాటి గోర్లు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా దగ్గరకు తీసుకురండి. ఇప్పుడు రెండు గోళ్లను, వేలి మొదటి కణుపులను కలిపి నొక్కండి.
ఫలితం ఎలా చూడాలి: అలా నొక్కినప్పుడు, మీ రెండు గోళ్ల మధ్య భాగంలో వజ్రాకారంలో (డైమండ్ ఆకారంలో) ఒక చిన్న ఖాళీ కనిపిస్తోందా? అలా కనిపిస్తే మీ ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగా ఉన్నాయని, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉందని భావించవచ్చు.
ప్రమాద సంకేతం: ఒకవేళ ఆ ఖాళీ కనిపించకుండా మీ రెండు వేళ్లు పూర్తిగా అతుక్కుపోయి ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఫింగర్ క్లబ్బింగ్ అనే పరిస్థితికి సంకేతం కావచ్చు, ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలి హెచ్చరికలలో ఒకటి. ఈ పరీక్ష కేవలం ఒక ప్రాథమిక హెచ్చరిక మాత్రమే, పూర్తి రోగ నిర్ధారణ కాదు.
వేళ్ల మధ్య ఖాళీ ఎందుకు మాయమవుతుంది?
అదే క్లబ్బింగ్. క్లబ్బింగ్ అనేది వేళ్ల కొనలు ఉబ్బినట్లుగా, మందంగా మారడం మరియు గోళ్లు గుండ్రంగా, ఉబ్బెత్తుగా పైకి లేవడం వంటి పరిస్థితి. శరీరంలోకి తగినంత ఆక్సిజన్ అందనప్పుడు ఇది సంభవిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కణితులు VEGF (వాస్కులర్ ఎండోథెలియల్ గ్రోత్ ఫ్యాక్టర్) అనే ప్రొటీన్‌ను విడుదల చేస్తాయి. ఇది వేళ్ల కొనలలో కొత్త రక్తనాళాలు ఏర్పడటానికి, ద్రవాలు చేరడానికి కారణమవుతుంది. ఫలితంగా వేళ్లు ఉబ్బి, వాటి మధ్య సహజంగా ఉండే ఖాళీ మూసుకుపోతుంది. ఇది కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కే కాక, ఇతర గుండె, జీర్ణకోశ వ్యాధులకు కూడా సంకేతం కావచ్చు.
ఇతర లక్షణాలను విస్మరించవద్దు
డైమండ్ ఫింగర్ టెస్ట్ ఒక సూచన మాత్రమే. దీనితో పాటు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి
-మూడు వారాలకు మించి తగ్గని దగ్గు.
-దగ్గినప్పుడు కఫంలో రక్తం పడటం.
-ఛాతీలో నొప్పి లేదా బిగుతుగా అనిపించడం.
-ఆయాసం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
-తీవ్రమైన నీరసం, బరువు తగ్గడం.
-ఆకలి మందగించడం.
-గొంతు బొంగురుపోవడం లేదా మింగడంలో కష్టం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications