Latest Updates
-
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే
World Parkinson's Day 2023: పార్కిన్సన్స్ డిసీజ్.. వణికించే ఈ జబ్బుతో జీవితకాలం ఇబ్బందే
మానవ శరీరంలో మెదడుదే కీలక పాత్ర. ఏ పని చేయాలన్నా మెదడు ఆదేశాలు ఇవ్వాల్సిందే. అన్ని పనులకు మెదడే ఆజమాయిషీ చేస్తుంది. నాడీ కణాల నుండి వచ్చే సంకేతాల ఆధారంగానే నడవడం, మాట్లాడటం సహా ఇతర పనులు చేయగలుగుతాం. మానవ శరీరానికి ముఖ్యమైన ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యే పార్కిన్సన్ డిసీజ్.

పార్కిన్సన్ వ్యాధి అంటే ఏంటి?
మెదడులో నాడీ కణాల మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంది. ఈ సమాచార మార్పిడికి కొన్ని రసాయనాలు అవసరం. ఇందులో డోపమైన్ కీలకం. డోపమైన్ క్షీణించడమే పార్కిన్సన్స్ జబ్బుకు మూలం. నాడీ కణాలు క్షీణించినా, అవి సరిగ్గా పనిచేయకపోయినా డోపమైన్ ఉత్పత్తి తగ్గుతుంది.
దీని వల్ల తల, చేతులు, కాళ్లు, దవడ వణుకు.. నెమ్మదించే నడక, మాటలో తడబాటు, కండరాలు బిగుసుకుపోవడం, వీటితో పాటు కుంగుబాటు, మతిమరుపు, నిస్సత్తువ, నిద్రలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు.
పార్కిన్సన్స్ వ్యాధి వల్ల శారీరకంగానే కాకుండా మానసిక సమస్యలూ వస్తాయి. భావోద్వేగ సమస్యలూ కనిపిస్తాయి. పార్కిన్సన్స్ వ్యాధి ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. అందులోనూ మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వృద్ధాప్యంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించడం వల్ల వృద్ధాప్యం వల్ల వచ్చే లక్షణాలని అనుకుంటాం.
ఈ వ్యాధి ఒకసారి వస్తే జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. ఈ రోగాన్ని నయం చేసే చికిత్సలు లేవు. కొన్ని రకాల మందులతో లక్షణాలను కొద్దిగా ఆలస్యం చేయవచ్చు అంతే. ఆధునిక చికిత్సలు ఉన్నప్పటికీ పూర్తిగా బయటపడే అవకాశాలు లేవు.
పార్కిన్సన్స్ వ్యాధి ఎవరికి వస్తుంది, ఎందుకొస్తుంది?
పార్కిన్సన్స్ వ్యాధి ఎందుకు వస్తుంది అనే కచ్చితమైన కారణం తెలియదు. వయస్సు మీద పడటమే కారణమని చెబుతున్నారు వైద్యులు. చాలా మందిలో 60 ఏళ్లు పైబడ్డాక ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు 50ల్లోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పార్కిన్సన్స్ వ్యాధికి జన్సుపరమైన అంశాలూ కారణమని నివేదికలు చెబుతున్నాయి.
కుటుంబంలో ఎవరైనా ఈ వ్యాధితో బాధపడితే మిగతా వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ. విటమిన్ డి లోపం కూడా కారణం కావొచ్చని అంటున్నారు. జన్యుపరంగా పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉన్న వారికి ఇతర కారణాలు తోడైతే పరిస్థితి తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంటుంది.
పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు:
* కాళ్లు, చేతులు, దవడ, తల భాగంలో వణుకు
* చేతులు, మొండెం బిగుతు
* నడక, మాటలు, ఇతర పనుల్లో నిదానం
* సమన్వయం కొరవడటం, మాట్లాడేటప్పుడు ఇబ్బంది, శరీరం బ్యాలెన్స్ తప్పడం, కిందపడిపోవడం
* డిప్రెషన్
* మతిమరుపు
* ఆహారం, నీరు మింగడంలో ఇబ్బంది
* శరీర కదలికలు స్తంభించడం
* మాటలో తడబాటు
* వాసన తగ్గడం
* మూత్ర విసర్జన, మల విసర్చనలో సమస్యలు
* నిద్రలేకపోవడం, పీడకలలు, ఉన్నట్టుండి మెలకువ రావడం
* ముఖ కవళికలు తగ్గిపోవడం
* చేతి రాతలో మార్పు
పార్కిన్సన్స్ చికిత్స:
ప్రస్తుతానికి పార్కిన్సన్స్ ను నయం చేసే చికిత్సలు లేవు. మందులతో లక్షణాలను అదుపు చేయవచ్చు. లివోడోపాతో డోపమైన ఉత్పత్తిని పెంచడం ద్వారా లక్షణాలను తగ్గించవచ్చు. లివోడోపాతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని తగ్గించడానికి కార్బిడోపాను సిఫార్సు చేస్తారు. ఈ మందులు ఎన్ని గంటలు పని చేస్తాయనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా వేసుకోవాలి. వైద్యులకు చెప్పకుండా మధ్యలో ఎట్టిపరిస్థితుల్లో మానేయకూడదు. హఠాత్తుగా ఆపేస్తే తీవ్ర సమస్యలు రావొచ్చు.
డోపమైన ఉత్పత్తికి డోపమైన్ ఆగోనిస్ట్ రకం మందులు, అసంకల్పిత కదలికలను ఆపడానికి ఎమాంటడిసి, వణుకు, కండరాల బిగువు తగ్గడానికి యాంటీకొలనెర్జిక్ మందులు సిఫార్సు చేస్తారు.
పార్కిన్సన్స్ శస్త్రచికిత్సలు:
మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నవారికి శస్త్రచికిత్సలు సిఫార్సు చేస్తారు వైద్యులు. మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చడం, లివోడోపా, కాబ్రిడోపాను జెల్ రూపంలో ఆంత్రమూలంలోకి విడుదల చేసే పంప్ లను అమర్చడం వంటి సర్జరీలు చేస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications