Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
World Tuberculosis Day 2023: టీబీ ఎలా సంక్రమిస్తుంది? శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
క్షయ రోగులు పోషకాహార లోపం కూడా ఏర్పడుతుంది. అయితే క్షయ సోకితే ఆకలి ఉండదు కాబట్టి బరువు చాలా తగ్గిపోతారు. అందుకే క్షయ సోకిన వారు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
క్షయ -టీబీ(ట్యూబర్‌కులోసిస్) అనేది ప్రాణాంతకమైన అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి నివారించదగినది, సరైన చికిత్సతో నయం చేయవచ్చు. క్షయ వ్యాధి సోకితే విపరీతమైన దగ్గు వస్తుంది. బరువు తగ్గుతారు, జ్వరం, రాత్రిపూట చెమటలు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
క్షయ రోగులు పోషకాహార లోపం కూడా ఏర్పడుతుంది. అయితే క్షయ సోకితే ఆకలి ఉండదు కాబట్టి బరువు చాలా తగ్గిపోతారు. అందుకే క్షయ సోకిన వారు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా ట్యూబర్‌కులోసిస్-టీబీ వ్యాధి సోకుతుంది. ఈ క్షయ క్రిములు ముఖ్యమంగా ఊపిరితిత్తుల్లో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగజేస్తాయి.
ఈ శ్వాసకోశ క్షయ అంటువ్యాధి. టీబీ ఉన్న వారు దగ్గినప్పుడు తుంపర్లు, తెమడ ద్వారా ఇతరులకు సోకుతుంది. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావొచ్చు. శ్వాసకోశేతర భాగాలు ఎముకలు, కీళ్లు, లింపు గ్రంథులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, గర్భసంచికి కూడా క్షయ వ్యాధి సోకుతుంది.
క్షయ వ్యాధి లక్షణాలు:
* దగ్గు
* కఫం
* జ్వరం
* బరువు తగ్గడం
* ఆకలి తగ్గడం
* పోషకాహార లోపం
* రాత్రిపూట చెమటలు
* పక్షవాతం
* చలి
* తలనొప్పి
* వాంతులు
క్షయ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది:
క్షయ వ్యాధి ఉన్న రోగి దగ్గినప్పుడు క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. క్షయ రోగులు దగ్గినప్పుడు ఊపిరితిత్తుల నుండి వచ్చే బ్యాక్టీరియాలు గాలిలో చేరుతాయి. వాటిని ఇతర వ్యక్తులు పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి టీబీని అభివృద్ధి చేస్తాయి.
క్షయ చికిత్స:
ఇంటెన్స్ ఫేస్:
ఇందులో నాలుగు రకాల టీబీ మందులు ఇస్తారు. వీటిని రెండు నెలల పాటు వేసుకోవాల్సి ఉంటుంది.
మెయింటెనెన్స్ ఫేస్:
ఇందులో రెండు రకాల టీబీ మందులు ఉంటాయి. వాటిని నాలుగు నెలల పాటు తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యక్తికి ఏ భాగంలో టీబీ ఉంది. ఎంత తీవ్రంగా ఉంది అనే విషయాలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇందులో కొన్ని మార్పులు కూడా ఉండొచ్చు. నాడీ వ్యవస్థ టీబీ ఉన్నవారు ఎక్కువ రోజులు మందులు తీసుకోవాల్సి రావొచ్చు. కొంతమందిలో క్షయ చికిత్సతో పాటు స్టెరాయిడ్స్, ఫిట్స్ సంబంధించిన మందులు కొంతకాలం వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు శస్ర్తచికిత్స కూడా అవసరం అవ్వొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications