Latest Updates
-
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.!
ఈ యోగాసనాలతో పడక గదిలో రెచ్చిపోతారు, అంగస్తంభన సమస్యలన్నీ పోతాయి
ఈమధ్యకాలంలో చాలా మంది పురుషులను వేధిస్తున్న సమస్య అంగస్తంభన. అంగం సరిగ్గా స్తంభించక చాలా మంది పురుషులు ఆత్మన్యూనత భావానికి, ఒత్తిడికి గురవుతున్న కేసులు పెరుగుతున్నాయి. దీని గురించి బహిరంగంగా మాట్లాడితే పరువు పోతుందన్న భావన వల్ల ఎవరితోనూ దీని గురించి షేర్ చేసుకోరు.
అంగం సరిగ్గా స్తంభించకపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైనవి.. ఆత్మవిశ్వాసం లేకపోవడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తక్కువ టెస్టోస్టెరాయ్ హార్మోన్, రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి ఉంటాయి.

అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటున్న వారు మొదట డాక్టర్లను సంప్రదించాలి. వారు అసలు సమస్య ఏమిటో గుర్తించి సరైన చికిత్స ద్వారా అంగం సరిగ్గా స్తంభించడానికి సహాయపడతారు. అయితే మందులతో మాత్రమే సమస్య పరిష్కారం కాదు.
అంగస్తంభన సమస్య ఎదుర్కొంటున్న వారు కొన్ని రకాల యోగాసనాలు చేయడం ద్వారా మంచి ప్రయోజనం పొందుతారు. ఎలాంటి యోగాసనాలు వేస్తే అంగస్తంభన సమస్య నుండి బయటపడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కుంభకాసనం:
ఈ ఆసనాన్ని ప్లాంక్ పోజ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగాసనం ద్వారా ఎండ్యురెన్స్, స్టామినా మెరుగుపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేస్తే శృంగారం చేస్తున్న సమయంలో స్టామినా ఎక్కువసేపు ఉంటుంది. ఎక్కువ సేపు బలంగా శృంగారం చేయగలుగుతారు.
ఎలా చేయాలి:
* కడుపు నేలకు తాకేలా పడుకోవాలి.
* తర్వాత చేతులను నడుము వద్దకు తీసుకువచ్చిన అర చేతులను నేలపై ఉంచాలి.
* రెండు కాళ్ల మునివేళ్ళను నేలపై ఉంచాలి.
* ఇప్పుడు శరీరాన్ని చేతులు, కాళ్లపై బ్యాలెన్స్ చేస్తూ మెల్లిగా పైకి లేపాలి.
* శరీరం సమాంతరంగా ఉండాలి ఈ ఆసనం చేయాలి.
* ఈ ప్లాంక్ పొజిషన్ లో 30 నుండి 60 సెకన్ల పాటు ఉండాలి.
2. పశ్చిమొత్తానాసనం:
ఈ ఆసనాన్ని సీటెడ్ ఫార్వర్డ్ బెండ్ అని కూడా పిలుస్తారు. ఇది పెరెన్నియల్ కండరాలను బలోపేతం చేయడం ద్వారా ఎండ్యురెన్స్ ను మెరుగుపరుస్తుంది. దీని వల్ల అంగం ఎక్కువ సేపు స్తంభిస్తుంది. ఇది ఉద్వేగానికి ముందు పెరెన్నియల్ కండరాలను సంకోచించడం ద్వారా అంగస్తంభన లోపాన్ని సరిచేయడంతో పాటు త్వరగా స్ఖలనం కాకుండా ఉంటుంది.
ఎలా చేయాలి:
* ముందుగా నిటారుగా కూర్చోవాలి. కాళ్లను కలిపి ఉంచి ఆపై సాగదీయాలి.
* పాదాలను పైకప్పు వైపు చూసేలా పెట్టాలి.
* రెండు చేతులను పైకి చాపి ఊపిరి పీల్చుకోవాలి.
* రెండు చేతులతో రెండు కాళ్లను పట్టుకోవాలి.
* వెన్నును ముందుకు వచ్చి రెండు కాళ్ల మధ్యలో చూస్తూ ఉండాలి.
* అరికాళ్లను, అరిచేతులతో పట్టుకుని కాసేపు అదే ఆసనంలో ఉండాలి.
3. ఉత్తానపాదాసన:
ఈ ఆసనం ద్వారా కండరాలు దృఢంగా మారి శృంగారం చేస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపించదు. మిషనరీ పొజిషన్ లో ఎక్కువ సేపు ఉంటూ శృంగారాన్ని ఆస్వాదించేందుకు వీలు కల్పిస్తుంది. క్వాడ్‌లు, గ్లూట్‌లను బలోపేతం చేస్తుంది. హిప్ ఫ్లెక్సర్ కండరాలను కూడా విస్తరించి బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం ద్వారా అంగానికి రక్త సరఫరా మెరుగుపడి, అంగస్తంభన జరిగేలా చేస్తుంది.
ఎలా చేయాలి:
* వీపుపై ఫ్లాట్ గా పడుకోవాలి.
* చేతులను పక్కలకు ఉంచి మడమలను కలిపి ఉంచాలి.
* 30 డిగ్రీల కోణంలో కాళ్లను పైకి ఎత్తాలి.
* ఇప్పుడు తలను, మొడను పైకి లేపి కొద్దిసేపు అదే భంగిమలో ఉండాలి.
* తర్వాత కాళ్ల, తలను నేలపై వాల్చి తిరిగి ఆసనం వేయాలి.
* ఈసారి కాళ్లను 60 డిగ్రీల కోణంలో పైకి తీసుకురావాలి. ఇలా ఈ ఆసనం చేస్తుండాలి.
4. నౌకాసనం:
దీనినే బోట్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం ద్వారా లైంగిక హార్మోన్లు విడుదల అవుతాయి. దీని వల్ల శృంగార సమయంలో శక్తి పెరుగుతుంది. ఈ ఆసనం పిరుదులను, తుంటి తొడ కండరాలను బలపరుస్తుంది. ఈ ఆసనం ద్వారా కటి కండరాలు బలోపేతం అవుతాయి. ఈ ఆసనం వల్ల ఎక్కువ సేపు శృంగారం చేయవచ్చు.
ఎలా చేయాలి:
* పిరుదులపై కూర్చుని ఈ ఆసనం వేయాలి.
* రెండు కాళ్లను వీలైనంత వరకు పైకి లేపాలి.
* వెన్నును నిటారుగా ఉంచుతూ రెండు చేతులను కాళ్ల వైపుకు చాపాలి.
* కాళ్లు, చేతులు స్ట్రెయిట్ గా ఉండాలి ఈ భంగిమలో ఉండాలి.
5. ధనురాసనం:
ధనురాసనాన్ని బో పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వల్ల పునరుత్పతతి అవయవాలు ఉత్తేజితం అవుతాయి. ఈ విల్లు భంగిమ ద్వారా అంగస్తంభన సమస్య తలెత్తదు.
* నేలపై పడుకోవాలి.
* కాళ్లను పైకి లేపి చేతులతో కాళ్లను పట్టుకోవాలి.
* నడుమును శరీరం పైభాగాన్ని వీలైనంత పైకి లేపాలి.
* విల్లులా శరీరాన్ని భంగమిలో ఉంచాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications